నగదు కోసం మిట్ట మధ్యాహ్నం..
అసలే లాక్‌డౌన్.. ఆపై ఎండాకాలం.. ఏటీఎంలల్లో నగదు నిల్.. దీంతో చేసేందేమీలేక ఖాతాదారులు బ్యాంకుకు క్యూ కట్టారు. తీరా బ్యాంకులోనూ నగదు లేకపోవడంతో ఆందోళనకు దిగారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బరోడాలో ఉన్న ఓ బ్యాంకు వద్ద సోమవారం చోటుచేసుకుంది. బ్యాంకు ప్రారంభమైన వెంటనే ఖాతాదారులు బ్యాంకులోకి దూసుకొచ్చారు. అయితే నగదు లేకపోవడంతో బ్యాంకు గార్డు ఖాతాదారులను బయటకు తోసివేసి.. గేటుకు తాళం వేశాడు. దీంతో ఖాతాదారులు మూడు గంటల పాటు ఎర్రటి ఎండలోనే ఆందోళన చేపట్టారు. […]
అసలే లాక్‌డౌన్.. ఆపై ఎండాకాలం.. ఏటీఎంలల్లో నగదు నిల్.. దీంతో చేసేందేమీలేక ఖాతాదారులు బ్యాంకుకు క్యూ కట్టారు. తీరా బ్యాంకులోనూ నగదు లేకపోవడంతో ఆందోళనకు దిగారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బరోడాలో ఉన్న ఓ బ్యాంకు వద్ద సోమవారం చోటుచేసుకుంది. బ్యాంకు ప్రారంభమైన వెంటనే ఖాతాదారులు బ్యాంకులోకి దూసుకొచ్చారు. అయితే నగదు లేకపోవడంతో బ్యాంకు గార్డు ఖాతాదారులను బయటకు తోసివేసి.. గేటుకు తాళం వేశాడు. దీంతో ఖాతాదారులు మూడు గంటల పాటు ఎర్రటి ఎండలోనే ఆందోళన చేపట్టారు. మధ్యాహ్నం ఒంటి గంటకు బ్యాంకుకు నగదు రావడంతో ఖాతాదారులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం గార్డు.. ఖాతాదారులను బ్యాంకులోనికి అనుమతించారు. ఏటీఎంలో సరిపడ నగదు నిల్వలు లేకపోవడంతోనే బ్యాంకుల్లో రద్దీ పెరుగుతోందని అధికారులు తెలిపారు. బ్యాంకు మేనేజర్ తమ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించాడని ఖాతాదారులు మండిపడ్డారు.