హైవేపై ప్రమాదకరంగా మారిన మట్టి.. తొలగించేదెప్పుడు..?

దిశ, జడ్చర్ల: మహబూబ్‌నగర్ టు మిర్యాలగూడ వెళ్లే 167వ జాతీయ రహదారిపై ప్రమాదభరితంగా ఉన్న మట్టి ప్రయాణికులను భయపెడుతోంది. ఆ మట్టిన తొలగించాల్సిన కాంట్రాక్టర్ పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. జడ్చర్ల మండల పరిధిలోని అల్వాల్‌పల్లి గ్రామం వద్ద 167వ జాతీయ రహదారిపై కొందరు వ్యక్తులు హిటాచి బండిని లారీ పై ఎక్కించడానికి రోడ్డుపై మట్టి ర్యాంపు ఏర్పాటు చేసి అలాగే నిర్లక్ష్యంగా వదిలేశారు. దీంతో ఈ రహదారి మీదుగా వెళ్లే ప్రయాణికులకు ర్యాంపు ప్రమాదభరితంగా మారింది. రాత్రివేళ […]

Update: 2021-10-01 07:29 GMT

దిశ, జడ్చర్ల: మహబూబ్‌నగర్ టు మిర్యాలగూడ వెళ్లే 167వ జాతీయ రహదారిపై ప్రమాదభరితంగా ఉన్న మట్టి ప్రయాణికులను భయపెడుతోంది. ఆ మట్టిన తొలగించాల్సిన కాంట్రాక్టర్ పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. జడ్చర్ల మండల పరిధిలోని అల్వాల్‌పల్లి గ్రామం వద్ద 167వ జాతీయ రహదారిపై కొందరు వ్యక్తులు హిటాచి బండిని లారీ పై ఎక్కించడానికి రోడ్డుపై మట్టి ర్యాంపు ఏర్పాటు చేసి అలాగే నిర్లక్ష్యంగా వదిలేశారు. దీంతో ఈ రహదారి మీదుగా వెళ్లే ప్రయాణికులకు ర్యాంపు ప్రమాదభరితంగా మారింది. రాత్రివేళ ద్విచక్ర వాహనదారులు ఈ మట్టి మీదకు దూసుకెళ్లి గాయాల పాలయ్యారని స్థానికులు తెలిపారు. రోడ్డు నిర్వహణ చేపట్టాల్సిన గుత్తేదారులు వారం రోజులుగా మట్టి ర్యాంపు రోడ్డుపై ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా రోడ్డు నిర్వహణ గుత్తేదారు ఆ మట్టిని తొలగించి ప్రమాదాలు సంభవించకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News