కలెక్టరేట్ నిర్మాణ పనుల్లో అపశ్రుతి
దిశ, మహబూబాబాద్: నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనుల్లో అపశ్రుతి జరిగింది. జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు జరుగుతుండగా సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా సెంట్రింగ్ కూలిపోయింది. త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. నలుగురు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. కాంట్రాక్టర్ కిశోర్, సివిల్ వర్కర్ బుజ్జి మాట్లాడుతూ ఆర్కిటెక్చర్ ప్లాన్ ప్రకారమే మూడు వేల ఫీట్స్ మేరకు సెంట్రింగ్ ఏర్పాటు చేశామన్నారు.7 టన్నులకు ఒక జాకీ చొప్పున మొత్తం 600 జాకీలు అమర్చామన్నారు. వాటిలో 3 జాకీలు ఫెయిల్ […]
దిశ, మహబూబాబాద్: నూతన కలెక్టరేట్ భవన నిర్మాణ పనుల్లో అపశ్రుతి జరిగింది. జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ భవన నిర్మాణ పనులు జరుగుతుండగా సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా సెంట్రింగ్ కూలిపోయింది. త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. నలుగురు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. కాంట్రాక్టర్ కిశోర్, సివిల్ వర్కర్ బుజ్జి మాట్లాడుతూ ఆర్కిటెక్చర్ ప్లాన్ ప్రకారమే మూడు వేల ఫీట్స్ మేరకు సెంట్రింగ్ ఏర్పాటు చేశామన్నారు.7 టన్నులకు ఒక జాకీ చొప్పున మొత్తం 600 జాకీలు అమర్చామన్నారు. వాటిలో 3 జాకీలు ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగిందన్నారు. మునిసిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించారు.