ప్రజల గుండెల్లో పసుపు పార్టీ ఉంది : మోపతయ్య
దిశ, అచ్చంపేట : టీడీపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తూ గ్రామీణ, పట్టణ ప్రాంతం అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలకు పార్టీని చేరువ చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, అచ్చంపేట నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ మోపతయ్య తెలిపారు. ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లాలోని ఉప్పునుంతల మండలం దిండి సమీపంలోని మైసమ్మ ఆలయం వద్ద ఆదివారం ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఉప్పునుంతల మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా […]
దిశ, అచ్చంపేట : టీడీపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తూ గ్రామీణ, పట్టణ ప్రాంతం అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలకు పార్టీని చేరువ చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, అచ్చంపేట నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ మోపతయ్య తెలిపారు. ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లాలోని ఉప్పునుంతల మండలం దిండి సమీపంలోని మైసమ్మ ఆలయం వద్ద ఆదివారం ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఉప్పునుంతల మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా మోపతయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అచ్చంపేట నియోజకవర్గంలోని గ్రామ గ్రామంలో టీడీపీ జెండాలను ఆవిష్కరించే క్రమంలో దిమ్మలను నిర్మించాలని, సభ్యత్వ నమోదు చేయాలని తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు.
పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కార్యకర్తలు సైనికుల్లా కృత నిశ్చయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల గుండెల్లో పసుపు పార్టీ ఉందని.. అయితే, ప్రజల వద్దకు వెళ్లి వారికి ధైర్యం కల్పించాల్సిన అవసరం కార్యకర్తలపై ఉందన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు ఆశయ సాధనలో భాగంగా ఇప్పటికీ టీడీపీకి గ్రామీణ స్థాయిలో పట్టుందని ప్రజలకు అవగాహన పెంపొందిస్తూ రాష్ట్రంలో పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ తిమ్మయ్య, పదర మండల అధ్యక్షుడు రాజన్న, నాయకులు సైదులు, అంజి, వంగూర్ మండల నాయకులు శ్రీనివాస్, లక్పతి నాయక్, రాజేష్ హన్య, సకృ, ఉప్పునుంతల మండల నాయకులు శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రెడ్డి, విష్ణు, అచ్చంపేట మండల అధ్యక్షులు రమణ, నాయకులు కృష్ణయ్య, పేపర్ తిరుపతయ్య, బల్మూర్ మండలం నాయకులు శ్రీశైలం, శ్రీను తదితరులు పాల్గొన్నారు.