కాలువల భూసేకరణ వేగవంతం
దిశ, మెదక్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రంగనాయక, కొమురవెళ్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్ల ప్రధాన కాలువలకు అనుసంధానంగా నిర్మించనున్న పిల్ల కాలువల భూ సేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. సిద్దిపేట కలెక్టరేట్‌లో సోమవారం జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డిస్ట్రిబ్యూటరీ కాలువలు, మైనర్ పిల్ల కాల్వల భూసేకరణకు రైతులు సహకరించాలని కోరారు. ఈ అంశంపై స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని మంత్రి ఆదేశించారు. భూసేకరణ […]
దిశ, మెదక్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రంగనాయక, కొమురవెళ్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్ల ప్రధాన కాలువలకు అనుసంధానంగా నిర్మించనున్న పిల్ల కాలువల భూ సేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. సిద్దిపేట కలెక్టరేట్‌లో సోమవారం జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డిస్ట్రిబ్యూటరీ కాలువలు, మైనర్ పిల్ల కాల్వల భూసేకరణకు రైతులు సహకరించాలని కోరారు. ఈ అంశంపై స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని మంత్రి ఆదేశించారు. భూసేకరణ ఒక యజ్ఞంలా చేయడంలో ప్రతి మండల తహసీల్దార్ కీలక పాత్ర పోషించాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, అడిషనల్ కలెక్టర్ పద్మాకర్, ఆర్డీఓ అనంతరెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టు ఎస్ఈ ఆనంద్, ఇరిగేషన్ ఈఈ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.