లంచం తీసుకుంటూ పట్టుబడిన వీఆర్వో
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: లంచం తీసుకుంటుండగా వీఆర్‌వోను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని తహసీల్దార్ ఆఫీసులో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. ఆంజనేయులు అనే గ్రామస్తుడు తాను కొనుగోలు చేసిన భూమికి ఆర్వోఆర్ ఇంప్లీమెంట్ కోసం మండలంలోని తహసీల్దార్ ఆఫీసుకు వెళ్లాడు. అక్కడ తన పూర్తి చేయాలంటే సుగూరు గ్రామానికి చెందిన వీఆర్వో వెంకటరమణ రూ.6000 లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని అశ్రయించాడు. పక్కా […]
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: లంచం తీసుకుంటుండగా వీఆర్‌వోను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని తహసీల్దార్ ఆఫీసులో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకివెళితే.. ఆంజనేయులు అనే గ్రామస్తుడు తాను కొనుగోలు చేసిన భూమికి ఆర్వోఆర్ ఇంప్లీమెంట్ కోసం మండలంలోని తహసీల్దార్ ఆఫీసుకు వెళ్లాడు.
అక్కడ తన పూర్తి చేయాలంటే సుగూరు గ్రామానికి చెందిన వీఆర్వో వెంకటరమణ రూ.6000 లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని అశ్రయించాడు. పక్కా పథకం ప్రకారం.. బాధితుడు వీఆర్‌వోకు డబ్బులు అందిస్తుండగా ఒక్కసారిగా ఏసీబీ అధికారులు దాడులు చేశారు. అనంతరం రెవెన్యూ అధికారి వెంకటరమణను అదుపులోకి తీసుకున్నారు. కాగా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.