ఏసీబీ వలలో విద్యుత్ శాఖ ఉద్యోగులు

దిశ ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీఎస్ ఎన్‌పీడీసీఎల్ కార్యాలయంలో లంచం తీసుకుంటున్న ముగ్గురు ఉద్యోగులను ఏసీబీ అధికారులు సోమవారం పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం…జిల్లా కేంద్రానికి చెందిన సంతోష్ అనే వ్యక్తి ఆర్వో ప్లాంట్‌లో విద్యుత్ మీటర్ అమర్చడం కోసం అధికారులను సంప్రదించారు. మీటర్ అమర్చేందుకు కమర్షియల్ ఏఈ శ్రీనివాస్, అడిషనల్ అసిస్టెంట్ ఇంజనీర్ కృష్ణారావు, లైన్ మెన్ ప్రకాష్‌లు రూ. 55 వేలు డిమాండ్ చేశారు. దీంతో వారికి మొదటి […]

Update: 2020-12-28 10:44 GMT

దిశ ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీఎస్ ఎన్‌పీడీసీఎల్ కార్యాలయంలో లంచం తీసుకుంటున్న ముగ్గురు ఉద్యోగులను ఏసీబీ అధికారులు సోమవారం పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం…జిల్లా కేంద్రానికి చెందిన సంతోష్ అనే వ్యక్తి ఆర్వో ప్లాంట్‌లో విద్యుత్ మీటర్ అమర్చడం కోసం అధికారులను సంప్రదించారు.

మీటర్ అమర్చేందుకు కమర్షియల్ ఏఈ శ్రీనివాస్, అడిషనల్ అసిస్టెంట్ ఇంజనీర్ కృష్ణారావు, లైన్ మెన్ ప్రకాష్‌లు రూ. 55 వేలు డిమాండ్ చేశారు. దీంతో వారికి మొదటి దఫాలో రూ. 35 వేలను ఇచ్చాడు. తాజాగా రూ.15 వేలను నగదు తీసుకుంటుండగా ముగ్గురు ఉద్యోగులను ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. వారిని విచారణ అనంతరం ఏసీబీ కోర్టులో ఏసీబీ అధికారులు హాజరు పరచనున్నారు.

Tags:    

Similar News