కీసర తహసీల్దార్ కేసులో… ఏసీబీ దర్యాప్తు ముమ్మరం

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కీసర తహసీల్దార్ కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. రూ.1.10 కోట్లు లంచం తీసుకున్న నాగరాజుపై ఏసీబీ ఇప్పటికే విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ కేసులో భూయజమాని ఇక్బాల్ ఇంట్లో మంగళవారం ఏసీబీ సోదాలు నిర్వహించింది. అయితే విషయాన్ని ముందే పసిగట్టిన ఇక్బాల్ సోదాల సమయంలో పరారయ్యారు. కాగా ఏసీబీ అధికారుల ఆదేశాలతో ఇక్బాల్‌ విచారణకు హాజరయ్యారు. భూవ్యవహారంలో తహసీల్దార్, శ్రీనాథ్, అంజిరెడ్డితో ఒప్పందాలపై ఏసీబీ ఆరా […]

Update: 2020-09-08 08:24 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కీసర తహసీల్దార్ కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. రూ.1.10 కోట్లు లంచం తీసుకున్న నాగరాజుపై ఏసీబీ ఇప్పటికే విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ కేసులో భూయజమాని ఇక్బాల్ ఇంట్లో మంగళవారం ఏసీబీ సోదాలు నిర్వహించింది.

అయితే విషయాన్ని ముందే పసిగట్టిన ఇక్బాల్ సోదాల సమయంలో పరారయ్యారు. కాగా ఏసీబీ అధికారుల ఆదేశాలతో ఇక్బాల్‌ విచారణకు హాజరయ్యారు. భూవ్యవహారంలో తహసీల్దార్, శ్రీనాథ్, అంజిరెడ్డితో ఒప్పందాలపై ఏసీబీ ఆరా తీస్తోంది. అలాగే ఇక్బాల్ స్టేట్‌మెంట్‌ను ఏసీబీ నమోదు చేసుకుంది.

Tags:    

Similar News