కీసర ఎమ్మార్వో కేసులో ఉన్నతాధికారుల పాత్ర!
దిశ, వెబ్ డెస్క్: మేడ్చల్ జిల్లాలోని కీసర ఎమ్మార్వో కేసును దర్యాప్తు ఏసీబీ వేగవంతం చేసింది. ఈ కేసులో పట్టుబడ్డ నిందితులను కస్టడీలోకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసింది. కస్టడీలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఏసీబీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో నలుగురు నిందితులను 4 రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. అదేవిధంగా ఈ కేసులో సంబంధమున్న ఇతర ఉన్నతాధికారుల పాత్రపై కూడా ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. శ్రీనాథ్, అంజిరెడ్డి […]
దిశ, వెబ్ డెస్క్: మేడ్చల్ జిల్లాలోని కీసర ఎమ్మార్వో కేసును దర్యాప్తు ఏసీబీ వేగవంతం చేసింది. ఈ కేసులో పట్టుబడ్డ నిందితులను కస్టడీలోకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేసింది. కస్టడీలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని ఏసీబీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో నలుగురు నిందితులను 4 రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది.
అదేవిధంగా ఈ కేసులో సంబంధమున్న ఇతర ఉన్నతాధికారుల పాత్రపై కూడా ఏసీబీ దర్యాప్తు చేస్తోంది. శ్రీనాథ్, అంజిరెడ్డి ఇంట్లో దొరికిన ప్రజాప్రతినిధుల డాక్యుమెంట్లను కూడా ఏసీబీ పరిశీలిస్తోంది. తహశీల్దార్ నాగరాజు బ్యాంకు లాకర్లను ఏసీబీ ఇవాల ఓపెన్ చేయనున్నట్లు తెలిసింది.