‘టీయూ వీసీ రెండు కోట్లు ఖర్చు చేసి వచ్చారట’
దిశ, కామారెడ్డి : ‘నేను రెండు కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడికి వచ్చాను.. ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ మేము బంధు మిత్రులం.. నన్ను మీరు ఏమి చేయలేరు’ అని బహిరంగంగా మాట్లాడుతున్న టీయూ (తెలంగాణ యూనివర్సిటీ) వీసీ రవీందర్ గుప్తాను తక్షణమే తొలగించాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. శనివారం కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో టీయూ వీసీ రవీందర్ గుప్తా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్బంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ కృష్ణ […]
దిశ, కామారెడ్డి : ‘నేను రెండు కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడికి వచ్చాను.. ఎడ్యుకేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ మేము బంధు మిత్రులం.. నన్ను మీరు ఏమి చేయలేరు’ అని బహిరంగంగా మాట్లాడుతున్న టీయూ (తెలంగాణ యూనివర్సిటీ) వీసీ రవీందర్ గుప్తాను తక్షణమే తొలగించాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. శనివారం కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో టీయూ వీసీ రవీందర్ గుప్తా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్బంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ కృష్ణ మాట్లాడుతూ.. తెలంగాణ యూనివర్సిటీలో అక్రమాలకు పాల్పడుతున్న వీసీ రవీందర్ గుప్తా ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్థులను కాంట్రాక్ట్ బేసిక్ కింద మార్చడానికి, ప్రమోషన్ కోసం ఒక్కొక్కరి దగ్గర నాలుగు లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ లంచం తీసుకుంటున్నారన్నారు.
అదేవిధంగా తనకు మాత్రమే పరిమితమైన హెచ్ఆర్సీని తన వ్యక్తిగత ఖర్చులతో పాటు కుటుంబ ఖర్చులను తెలంగాణ యూనివర్సిటీ అకౌంట్లో రాసి వేలకు వేలు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. చివరికి ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ స్వీపర్ నుండి కూడా ఉద్యోగం రావాలంటే 50,000 ఇస్తేనే ఉద్యోగం అన్నట్టుగా దిగజారిపోయారని తెలిపారు. గొప్ప చరిత్ర కలిగిన తెలంగాణ యూనివర్సిటీని రిజిస్ట్రార్ కనకయ్య, వీసీ రవీందర్ గుప్తా బ్రష్టు పట్టిస్తున్నారన్నారు. వెంటనే వీసీని తొలగించాలని డిమాండ్ చేశారు.