మల్లారెడ్డి యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలి: ఏబీవీపీ

దిశ, తెలంగాణ బ్యూరో: మల్లారెడ్డి యూనివర్సిటీ, ఇంజనీరింగ్ కళాశాలల గుర్తింపును రద్దు చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఇదే డిమాండ్‌తో ఉన్నత విద్య మండలి ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం నకిలీ పత్రాలను పంపి న్యాక్ గుర్తింపు పొందాలనుకోవడం అత్యంత దారుణమని, స్వయంగా టీఆర్ఎస్‌ మంత్రికి చెందిన కళాశాలలే ఇలా తప్పుడు పత్రాలను పంపించడాన్ని వారు ఖండించారు. రాష్ట్రంలో 13కు పైగా ఇంజనీరింగ్ కాలేజీలు నడుపుతున్నా, […]

Update: 2020-12-28 09:17 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: మల్లారెడ్డి యూనివర్సిటీ, ఇంజనీరింగ్ కళాశాలల గుర్తింపును రద్దు చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఇదే డిమాండ్‌తో ఉన్నత విద్య మండలి ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యం నకిలీ పత్రాలను పంపి న్యాక్ గుర్తింపు పొందాలనుకోవడం అత్యంత దారుణమని, స్వయంగా టీఆర్ఎస్‌ మంత్రికి చెందిన కళాశాలలే ఇలా తప్పుడు పత్రాలను పంపించడాన్ని వారు ఖండించారు. రాష్ట్రంలో 13కు పైగా ఇంజనీరింగ్ కాలేజీలు నడుపుతున్నా, ఏ ఒక్క కాలేజీలో సరైన సదుపాయాలు లేవన్నారు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి, జేఎన్‌టీయూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు.

Tags:    

Similar News