ఈ నెల 21న విద్యాసంస్థ‌లు బంద్..

దిశ‌, ప్రతినిధి, హైద‌రాబాద్: క‌రోనా విపత్కర ప‌రిస్థితిల్లో విద్యా రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిన‌ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంట‌ర్మీడియట్ ఫ‌లితాల్లో గంద‌ర‌గోళంతో ల‌క్షలాది మంది విద్యార్థులు మాన‌సిక క్షభ‌కు, ఆత్మహ‌త్యల‌కు కార‌ణ‌మైంద‌ని ఏబీవీపీ నాయ‌కులు విమ‌ర్శించారు. ఇంట‌ర్మీడియ‌ట్ కార్యాల‌యం ఎదుట శ‌నివారం నిర్వహించిన ధ‌ర్నాలో ఏబీవీపీ రాష్ట్ర కార్యద‌ర్శి ప్రవీణ్‌రెడ్డి మాట్టాడుతూ.. క‌రోనా స‌మ‌యంలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో చ‌దివే ఇంట‌ర్ విద్యార్థుల‌కు అన్‌లైన్ క్లాసుల నిర్వహ‌ణ‌లో కేవ‌లం ప్రక‌ట‌న‌ల‌కే ప‌రిమిత‌మైంద‌న్నారు. అన్‌లైన్ క్లాసుల‌కు ల‌క్షలాది మంది […]

Update: 2021-12-18 10:48 GMT

దిశ‌, ప్రతినిధి, హైద‌రాబాద్: క‌రోనా విపత్కర ప‌రిస్థితిల్లో విద్యా రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిన‌ టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంట‌ర్మీడియట్ ఫ‌లితాల్లో గంద‌ర‌గోళంతో ల‌క్షలాది మంది విద్యార్థులు మాన‌సిక క్షభ‌కు, ఆత్మహ‌త్యల‌కు కార‌ణ‌మైంద‌ని ఏబీవీపీ నాయ‌కులు విమ‌ర్శించారు. ఇంట‌ర్మీడియ‌ట్ కార్యాల‌యం ఎదుట శ‌నివారం నిర్వహించిన ధ‌ర్నాలో ఏబీవీపీ రాష్ట్ర కార్యద‌ర్శి ప్రవీణ్‌రెడ్డి మాట్టాడుతూ.. క‌రోనా స‌మ‌యంలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో చ‌దివే ఇంట‌ర్ విద్యార్థుల‌కు అన్‌లైన్ క్లాసుల నిర్వహ‌ణ‌లో కేవ‌లం ప్రక‌ట‌న‌ల‌కే ప‌రిమిత‌మైంద‌న్నారు.

అన్‌లైన్ క్లాసుల‌కు ల‌క్షలాది మంది విద్యార్థులు దూర‌మ‌వుతున్నార‌ని అనేక స‌ర్వేలు తేల్చిన‌ప్పటికీ ఎలాంటి చ‌ర్యలు తీసుకోకుండా క్లాసులు నిర్వహించ‌డంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. దీనికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ వ‌హించాల‌ని డిమాండ్ చేశారు. కోవిడ్ ప్రస్తుత త‌రుణంలో ఇంట‌ర్ విద్యార్థులంద‌రినీ పాస్ చేయాల‌ని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ మొండి వైఖ‌రిని నిర‌సిస్తూ డిసెంబ‌ర్ 21న విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యద‌ర్శి సుమ‌న్ శంక‌ర్‌, రాష్ట్ర స‌మితి స‌భ్యులు క‌మ‌ల్ సురేష్‌, అరవింద్‌, శ్రీ‌కాంత్‌, మ‌హేష్‌, శ్రీ‌నాధ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tags:    

Similar News