కరోనాపై ఏబీవీపీ కార్యకర్తల పోరు
దిశ, ముధోల్ : కరోనా వైరస్ నియంత్రణకు ఏబీవీపీ కార్యకర్తలు నడుము బిగించారు. ఎప్పుడూ విద్యార్థుల సమస్యలపై పోరాడే ఏబీవీపీ.. ప్రస్తుతం కరోనాపై పోరు చేస్తున్నారు. బైంసా పట్టణంలోని రద్దీ ప్రాంతాలు, వీధుల్లో, బస్టాండ్ ఏరియాల్లో వ్యవసాయంలో ఉపయోగించే మందు పిచికారి డబ్బాల్లో హైపోక్లోరైడ్ ద్రవణాన్ని నింపి స్ప్రే చేశారు. జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో కాలనీల్లోని విధుల్లో కరోనా వైరస్ ప్రభలకుండా ఏబీవీపీ కార్యకర్తలు ఈ ద్రవణాన్ని స్ప్రే చేశారు. నిత్యం ప్రజలతో సందడిగా ఉండే […]
దిశ, ముధోల్ : కరోనా వైరస్ నియంత్రణకు ఏబీవీపీ కార్యకర్తలు నడుము బిగించారు. ఎప్పుడూ విద్యార్థుల సమస్యలపై పోరాడే ఏబీవీపీ.. ప్రస్తుతం కరోనాపై పోరు చేస్తున్నారు. బైంసా పట్టణంలోని రద్దీ ప్రాంతాలు, వీధుల్లో, బస్టాండ్ ఏరియాల్లో వ్యవసాయంలో ఉపయోగించే మందు పిచికారి డబ్బాల్లో హైపోక్లోరైడ్ ద్రవణాన్ని నింపి స్ప్రే చేశారు.
జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో కాలనీల్లోని విధుల్లో కరోనా వైరస్ ప్రభలకుండా ఏబీవీపీ కార్యకర్తలు ఈ ద్రవణాన్ని స్ప్రే చేశారు. నిత్యం ప్రజలతో సందడిగా ఉండే కూరగాయల దుకాణాలు, ఆటోస్టాండ్, బస్టాండ్, హోటల్స్ ఏరియాల్లో ఏబీవీపీ విద్యార్థులు గ్రూపులుగా విడిపోయి హైపోక్లోరైడ్ ద్రవణాన్ని స్ప్రే చేశారు. దీని వల్ల వైరస్ వ్యాప్తి తగ్గుతుందని చెబుతున్నారు. ఏబీవీపీ కార్యకర్తల కృషిని పట్టణవాసులు ప్రశంసించారు.