అభిషేక్‌కు కరోనా నెగెటివ్
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ కొవిడ్ -19 నుంచి కోలుకున్నారు. కరోనా పాజిటివ్ రావడంతో 29 రోజులుగా ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అభిషేక్.. ఎట్టకేలకు మహమ్మారి నుంచి బయటపడ్డారు. కరోనా నెగెటివ్ రావడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్నారు. దీంతో జూనియర్ బచ్చన్ ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో హాస్పిటల్‌లో తన స్టేటస్ రిపోర్ట్ షేర్ చేశారు. నమ్మకం ఫలించిందన్న అభిషేక్.. తను కోలుకోవాలని ప్రార్థించిన అభిమానులు, బంధు మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. […]
బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ కొవిడ్ -19 నుంచి కోలుకున్నారు. కరోనా పాజిటివ్ రావడంతో 29 రోజులుగా ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అభిషేక్.. ఎట్టకేలకు మహమ్మారి నుంచి బయటపడ్డారు. కరోనా నెగెటివ్ రావడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అవుతున్నారు. దీంతో జూనియర్ బచ్చన్ ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో హాస్పిటల్‌లో తన స్టేటస్ రిపోర్ట్ షేర్ చేశారు. నమ్మకం ఫలించిందన్న అభిషేక్.. తను కోలుకోవాలని ప్రార్థించిన అభిమానులు, బంధు మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.
https://www.instagram.com/p/CDn1fvEJZXo/?igshid=1kbxd7rz5fx7g
తనను కేరింగ్‌గా చూసుకున్న నానావతి ఆస్పత్రి వైద్యులు, నర్సులకు ధన్యవాదాలు తెలిపారు. తనతో పాటు తన కుటుంబాన్ని కరోనా నుంచి కాపాడినందుకు రుణపడి ఉంటామన్నారు అభిషేక్. మీరు లేకపోతే మేము కరోనాను జయించేవాళ్లం కాదన్నాడు.
కాగా జూలై 27న కరోనా నెగెటివ్ రావడంతో ఐశ్వర్య, ఆరాధ్య డిశ్చార్జ్ కాగా.. ఆగస్ట్ 2న అమితాబ్ బచ్చన్ కరోనా నుంచి కోలుకుని ఇంటికి వెళ్లారు.