ఐశ్వర్యపై క్రష్ లేకుండా ఎవరు ఉంటారు? : అభిషేక్
దిశ, సినిమా : ‘సంతోషకరమైన వివాహ బంధానికి స్నేహమే పునాది’ అంటున్నాడు అభిషేక్ బచ్చన్. ఐశ్వర్యా రాయ్‌తో కలిసి 14 ఏళ్ల వివాహబంధాన్ని సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్న జూనియర్ బచ్చన్.. ఓ ఇంటర్వ్యూలో తనను ఫస్ట్ మీట్ అయిన రోజులను గుర్తుచేసుకున్నాడు. తన తండ్రి అమితాబ్ బచ్చన్ ‘మృత్యుదాత’ సినిమాకు ప్రొడక్షన్ బాయ్‌గా ఉన్నప్పుడు తొలిసారి తనను చూశానని తెలిపాడు. స్విట్జర్లాండ్‌లో చదువుకున్న తనకు బ్యూటిఫుల్ లొకేషన్స్‌పై అవగాహన ఉండటం వల్ల లొకేషన్ సెలక్షన్ పనిమీద తనను […]
దిశ, సినిమా : ‘సంతోషకరమైన వివాహ బంధానికి స్నేహమే పునాది’ అంటున్నాడు అభిషేక్ బచ్చన్. ఐశ్వర్యా రాయ్‌తో కలిసి 14 ఏళ్ల వివాహబంధాన్ని సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్న జూనియర్ బచ్చన్.. ఓ ఇంటర్వ్యూలో తనను ఫస్ట్ మీట్ అయిన రోజులను గుర్తుచేసుకున్నాడు. తన తండ్రి అమితాబ్ బచ్చన్ ‘మృత్యుదాత’ సినిమాకు ప్రొడక్షన్ బాయ్‌గా ఉన్నప్పుడు తొలిసారి తనను చూశానని తెలిపాడు. స్విట్జర్లాండ్‌లో చదువుకున్న తనకు బ్యూటిఫుల్ లొకేషన్స్‌పై అవగాహన ఉండటం వల్ల లొకేషన్ సెలక్షన్ పనిమీద తనను పంపించారని, అక్కడే రెండు రోజులు ఉండాల్సి వచ్చిందని చెప్పాడు. ఆ సమయంలో చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ బాబీ డియోల్.. తన తొలి సినిమా ‘ఔర్ ప్యార్ హో గయా’ షూటింగ్ స్విట్జర్లాండ్‌లో జరుగుతోందని, తను అక్కడే ఉన్నానని తెలుసుకుని డిన్నర్‌కు ఇన్వైట్ చేశాడని వెల్లడించాడు. అప్పుడే ఫస్ట్ టైమ్ ఐశ్వర్యను మీట్ అయ్యానని తెలిపాడు. ‘ఆమెను తనను చూశాక ఎవరు మాత్రం క్రష్ ఫీల్ అవకుండా ఉంటారు చెప్పండి?’ అన్నారు. ఆ తర్వాత చాలా ఏళ్లుగా స్నేహితులుగా ఉన్న తాము.. 2007లో పెళ్లితో ఒక్కటయ్యామని చెప్పుకొచ్చాడు.