ఆరోగ్యసేతు యాప్.. ఇలా డిలీట్ చేయండి

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్రం.. ‘ఆరోగ్య సేతు’ యాప్‌ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రయాణాలు చేయాలన్నా, ఆఫీసులకు వెళ్లాలన్నా, కొవిడ్ లక్షణాలున్నా.. కరోనా వచ్చిన వారి నుంచి అలర్ట్‌గా ఉండాలన్నా.. ‘ఆరోగ్య సేతు’ యాప్ వాడాలని కేంద్రం సూచించడంతో.. ఈ యాప్‌ను భారతీయులు రికార్డు స్థాయిలో డౌన్‌లోడ్ చేసుకున్నారు. అయితే, ఆరోగ్యసేతు యాప్ యూజర్లు.. యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత దాన్ని డిలీట్ చేసుకునే సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తెస్తున్నట్టు […]

Update: 2020-07-07 00:46 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వైరస్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్రం.. ‘ఆరోగ్య సేతు’ యాప్‌ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రయాణాలు చేయాలన్నా, ఆఫీసులకు వెళ్లాలన్నా, కొవిడ్ లక్షణాలున్నా.. కరోనా వచ్చిన వారి నుంచి అలర్ట్‌గా ఉండాలన్నా.. ‘ఆరోగ్య సేతు’ యాప్ వాడాలని కేంద్రం సూచించడంతో.. ఈ యాప్‌ను భారతీయులు రికార్డు స్థాయిలో డౌన్‌లోడ్ చేసుకున్నారు. అయితే, ఆరోగ్యసేతు యాప్ యూజర్లు.. యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత దాన్ని డిలీట్ చేసుకునే సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తెస్తున్నట్టు కేంద్రం తాజాగా ప్రకటించింది. కానీ అకౌంట్‌ డిలీట్‌ చేసిన 30 రోజులకు యాప్‌ నుంచి డేటా తొలగిపోతుందని కేంద్రం స్పష్టం చేసింది.

కరోనావైరస్ సోకినవారి కదలికలను అబ్జర్వ్ చేసేందుకు, కాంటాక్ట్​ ట్రేసింగ్​ కోసం కేంద్రం ఈ యాప్‌ను ఏప్రిల్​ 2న ప్రారంభించింది. కాగా, ఇప్పటివరకు ఆరోగ్యసేతు యాప్‌ను 100+ మిలియన్స్ మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఇటీవల బ్లూటూత్ కాంటాక్ట్స్‌ ఆధారంగా ప్రమాద స్థాయిని అంచనా వేసే లక్షణాన్ని కూడా ఇందులో చేర్చారు. తాజాగా ఆరోగ్య సేతులో హెల్త్‌ స్టేటస్‌ను ఇతర హెల్త్‌ యాప్స్‌లో షేర్‌ చేసేందుకు డెవలపర్స్.. కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చారు. ఇందుకోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి.. ‘అప్రూవల్ ఫర్ ఆరోగ్యసేతు స్టేటస్’పై ట్యాప్ చేయాలి. ఆ తర్వాత.. ఎక్స్‌టర్నల్ యాప్స్ నుంచి కూడా ఆరోగ్య సేతు యాప్‌లో మన హెల్త్ స్టేటస్ చూసుకోవచ్చు. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే ఈ అవకాశం అందుబాటులో ఉంది.

ఇలా డిలీట్ చేయండి :
తాజాగా కేంద్రం ఆరోగ్యసేతును పర్మినెంట్ డిలీట్‌గా చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. యాప్‌లో లెఫ్ట్‌లో ఉన్న యూజర్‌ ఐకాన్‌ను క్లిక్‌ చేసి సెట్టింగ్స్‌లోకి వెళ్లి.. ‘డిలీట్‌ మై అకౌంట్‌’(అదే ఐఓఎస్ యూజర్ల అయితే.. డిలీట్ అకౌంట్ టైటిల్‌పై ట్యాప్ చేయాలి) పై క్లిక్ చేయాలి.

డిలీట్ చేయడం ద్వారా..
– ఆరోగ్యసేతు రిజిస్ట్రేషన్ పర్మినెంట్‌గా క్యాన్సల్ అవుతుంది.
– ఫోన్ నుంచి యాప్ డేటా మొత్తం ఎరేజ్ అవుతుంది.
– 30 రోజుల తర్వాత మీ ఇన్ఫర్మేషన్ ఎరేజ్ అవుతుంది.
ఇలాంటి ఓ మెసేజ్ కనిపిస్తుంది. దాన్ని ఒకే చేయగానే.. మీ ఫోన్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయాలి. దీంతో యాప్‌లో మీ అకౌంట్‌ డిలీట్‌ అవుతుంది.

Tags:    

Similar News