ఫస్ట్ టైమ్ అనుకుంటా.. స్టార్ కిడ్స్‌కు నెటిజన్ల కాంప్లిమెంట్స్
దిశ, సినిమా : డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ డాటర్ ఆలియా కశ్యప్, దర్శకుడు ఇంతియాజ్ అలీ కూతురు ఐదా అలీ బెస్ట్ ఫ్రెండ్స్ అన్న విషయం చాలా మందికి తెలుసు. ఐదా ప్రస్తుతం కాలిఫోర్నియాలోని చంపన్ యూనివర్సిటీకి చెందిన డాడ్జ్ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా ఆర్ట్స్‌లో ఫిల్మ్‌మేకింగ్ కోర్స్ చేస్తోంది. ఈ కోర్సులో భాగంగా మూడున్నర నిమిషాల నిడివితో షార్ట్ ఫిల్మ్ చేసి యూట్యూబ్‌లో షేర్ చేసింది. ‘గాయత్రి’ పేరుతో తీసిన ఈ లఘు […]
దిశ, సినిమా : డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ డాటర్ ఆలియా కశ్యప్, దర్శకుడు ఇంతియాజ్ అలీ కూతురు ఐదా అలీ బెస్ట్ ఫ్రెండ్స్ అన్న విషయం చాలా మందికి తెలుసు. ఐదా ప్రస్తుతం కాలిఫోర్నియాలోని చంపన్ యూనివర్సిటీకి చెందిన డాడ్జ్ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా ఆర్ట్స్‌లో ఫిల్మ్‌మేకింగ్ కోర్స్ చేస్తోంది. ఈ కోర్సులో భాగంగా మూడున్నర నిమిషాల నిడివితో షార్ట్ ఫిల్మ్ చేసి యూట్యూబ్‌లో షేర్ చేసింది. ‘గాయత్రి’ పేరుతో తీసిన ఈ లఘు చిత్రంలో ఐదా ఫ్రెండ్ ఆలియా టైటిల్ రోల్ ప్లే చేయగా.. తన నటనకు కాంప్లిమెంట్స్ అందుకుంటోంది. హైయర్ స్టడీస్ కోసం ఇండియా నుంచి యూఎస్ వెళ్లిన ఇంట్రావర్ట్ గర్ల్ గాయత్రి.. అక్కడ కాలేజ్ మేట్స్‌తో ఫ్రెండ్‌షిప్ చేసేందుకు ఎంత ఇబ్బంది పడుతుంది? రూమ్‌మేట్స్ అంతా పార్టీలో మునిగితేలుతుంటే.. డార్క్ రూమ్‌లో ఒంటరిగా డ్రింక్ చేస్తున్న తను ఫస్ట్ ఫ్రెండ్‌ను ఎలా సెలెక్ట్ చేసుకుంది? అనేది షార్ట్ ఫిల్మ్‌లో చూపించారు. కాగా ఆలియా, ఐదా కాంబినేషన్‌కు సోషల్ మీడియాలో ప్రశంసలు అందిస్తూనే.. వీరి కలయికలో మరిన్ని ప్రాజెక్ట్స్ రావాలని కోరుకుంటున్నారు నెటిజన్లు.