చిన్నారి ఆద్య తండ్రి రైలు కిందపడి సూసైడ్

దిశ, వెబ్‌డెస్క్: 10రోజుల క్రితం హత్యకు గురైన ఆరేళ్ల చిన్నారి ఆద్య కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. కూతురు మరణాన్ని జీర్ణించుకోలేక తండ్రి కల్యాణ్ భువనగిరి రైల్వేస్టేషన్‌లో రైలుకింద పడి శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. కల్యాణ్… భువనగిరిలో పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తుండగా… కూతురు చదువు కోసం మేడ్చల్ జిల్లాలోని ఘట్‌కేసర్‌లో నివాసం ఉంటున్నారు. కరుణాకర్‌ అనే వ్యక్తి ఆరేళ్ల చిన్నారి ఆద్యను కత్తితో గొంతు కోసి చంపడంతో కల్యాణ్.. తీవ్ర మనస్థాపానికి గురైయ్యాడు. కల్యాణ్, అనూష […]

Update: 2020-07-11 04:35 GMT
చిన్నారి ఆద్య తండ్రి రైలు కిందపడి సూసైడ్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: 10రోజుల క్రితం హత్యకు గురైన ఆరేళ్ల చిన్నారి ఆద్య కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. కూతురు మరణాన్ని జీర్ణించుకోలేక తండ్రి కల్యాణ్ భువనగిరి రైల్వేస్టేషన్‌లో రైలుకింద పడి శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. కల్యాణ్… భువనగిరిలో పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తుండగా… కూతురు చదువు కోసం మేడ్చల్ జిల్లాలోని ఘట్‌కేసర్‌లో నివాసం ఉంటున్నారు. కరుణాకర్‌ అనే వ్యక్తి ఆరేళ్ల చిన్నారి ఆద్యను కత్తితో గొంతు కోసి చంపడంతో కల్యాణ్.. తీవ్ర మనస్థాపానికి గురైయ్యాడు.

కల్యాణ్, అనూష దంపతుల కూతురు ఆద్య. అనూష కరుణాకర్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకొని.. కొద్దిరోజుల నుంచి దూరం పెడుతూ, మరో వ్యక్తితో సన్నిహితంగా ఉండంటంతో అనూషపై కరుణాకర్ కోపం పెంచుకున్నాడు. ఇదే క్రమంలో పదిరోజుల క్రితం అనూష ఇంటికి కరుణాక‌ర్ వెళ్లగా అప్పుడు ఆమె మరో వ్యక్తితో రూమ్‌లో ఉంది. ఆ సమయంలో కరుణాకర్‌ వచ్చిన విషయాన్ని గమనించిన అనూష… ఆ వ్యక్తిని బాత్‌రూమ్‌లో దాచి పెట్టింది. ఈ విషయాన్ని చూసిన కరుణాకర్‌ తలుపు తీయాలని గట్టిగా అరవడంతో అప్పుడు ఆరేళ్ల చిన్నారి ఆద్యను తల్లి బయటకు పంపింది.

అప్పుడు చిన్నారి గొంతుపై కత్తిపెట్టిన కరుణాకర్‌… బాత్‌రూమ్‌లో దాచిన వ్యక్తిని బయటకు తీసుకురాకుంటే ఆద్యను చంపుతానని బెదిరించాడు. అయితే అనూష కరుణాకర్‌తో వాగ్వాదానికి దిగి ఇంట్లో ఎవరూ లేరు.. వెళ్లి పోవాలని చెప్పడంతో కర్కశంగా వ్యవహరించిన అతడు చిన్నారిని గొంతు కోసి చంపాడు. తర్వాత కరుణాకర్‌తో పాటు, అనూష‌, మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. భార్య చేసిన పనికి కూతురు బలి కావడంతో తీవ్ర మనస్థాపానికి గురైన కల్యాణ్… భువనగిరి రైల్వేస్టేషన్ సమీపంలో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

Tags:    

Similar News