Yuvraj Singh: రోహిత్ లాంటి కెప్టెన్‌ను ఇప్పటివరకు చూడలేదు
టీమిండియా(Team India) కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)పై మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్(Yuvraj Singh) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా(Team India) కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma)పై మాజీ ప్లేయర్ యువరాజ్ సింగ్(Yuvraj Singh) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయన ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ గురించి మాట్లాడారు. రోహిత్ శర్మ గొప్ప కెప్టెన్ అని కొనియాడారు. రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా వన్డే ప్రపంచకప్ ఫైనల్‌కు వెళ్లింది. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ గెలిచిందని గుర్తుచేశారు. ఫామ్ లేమి కారణంగా మ్యాచ్ నుంచి తనకు తానుగా తప్పకున్న సారథిని తాను ఇప్పటివరకు చూడలేదు. రోహిత్ తొలి ప్రాధాన్యత జట్టే అని మరోసారి నిరూపించారు. అదే రోహిత్ శర్మ గొప్పతనం అని అన్నారు. కాగా, ఇటీవల రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీని కోల్పోయిన విషయం తెలిసిందే.