తగ్గెదే లే.. ఒకేసారి ఇద్దరితో..

దిశ, ఉట్నూర్: మండలంలోని వింత పెళ్లి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒకే మండపంలో ప్రేమించిన ఇద్దరు యువతులను పెళ్లాడాడు ఓ యువకుడు. ఆ ఇద్దరు యువతులతో పాటు వారి కుటుంబ సభ్యులు.. గ్రామ పెద్దల నుంచి కూడా అనుమతి లభించడంతో ఊరందరి ముందే ఈ తంతు సాఫీగా జరిగింది. ఇది అదిలాబాద్ జిల్లాలో గిరిజన సంస్కృతి సాంప్రదాయ బద్దంగా జరగడం మరో విశేషం. వివరాల్లోకి వెళ్తే.. ఉట్నూర్ మండలం ఘన్పూర్ గ్రామానికి​ చెందిన అర్జున్ ఉపాధ్యాయ శిక్షణ […]

Update: 2021-06-19 01:46 GMT

దిశ, ఉట్నూర్: మండలంలోని వింత పెళ్లి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒకే మండపంలో ప్రేమించిన ఇద్దరు యువతులను పెళ్లాడాడు ఓ యువకుడు. ఆ ఇద్దరు యువతులతో పాటు వారి కుటుంబ సభ్యులు.. గ్రామ పెద్దల నుంచి కూడా అనుమతి లభించడంతో ఊరందరి ముందే ఈ తంతు సాఫీగా జరిగింది. ఇది అదిలాబాద్ జిల్లాలో గిరిజన సంస్కృతి సాంప్రదాయ బద్దంగా జరగడం మరో విశేషం.

వివరాల్లోకి వెళ్తే.. ఉట్నూర్ మండలం ఘన్పూర్ గ్రామానికి​ చెందిన అర్జున్ ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటున్నాడు.ఈ సమయంలోనే తన మేనత్తల ఇద్దరి కూతుళ్లను ఒకరికి తెలియకుండా మరొకరిని ప్రేమించాడు. ఉషారాణిది అదే గ్రామం కాగా.. సూర్యకళది శంభుగూడెం. గత మూడేళ్లుగా ఇద్దరు మరదళ్లతో ఒకరికి తెలియకుండా ఒకరితో ప్రేమాయణం సాగించాడు అర్జున్. ఇక ఈ క్రేజీ లవ్ స్టోరీలకు పెళ్లితో శుభం కార్డు వేయాలని భావించాడు. నెల రోజుల కిందట ఇద్దరినీ ప్రేమించాను. ఇద్దరినీ పెళ్లి చేసుకుంటానని మూడు కుటుంబాల ముందు ప్రతిపాదన ఉంచాడు.

దీంతో ఇరు కుటుంబాల వారు గ్రామ పెద్దలను ఆశ్రయించారు. సూర్యకళ, ఉషారాణిని అర్జున్​కు ఇచ్చి వివాహం చేయడానికి వారి కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. ఈనెల 14న ఘన్​పూర్​లో సూర్యకళ, ఉషారాణిని ఆదివాసీల సంప్రదాయం ప్రకారం అర్జున్​ పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్ళి సందడికి ఇరు కుటుంబాలతో పాటు బంధు మిత్రులందరూ పాల్గొని పెళ్ళి ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం ఉట్నూర్ మండలంలో అర్జున్ పెండ్లి తంతు చర్చనీయాంశం అయింది.

Tags:    

Similar News