Break The Lockdown Rules.. పోలీసులపై దాడి చేసేందుకు యత్నం
దిశ, వెబ్‌డెస్క్: లాక్‌డౌన్ సమయంలో అనవసరంగా రోడ్డు మీదకు వస్తే పోలీసులు కేసులు నమోదు చేస్తూ వాహనాలను సీజ్ చేస్తున్నారు. కరోనా భయంతో సగం మంది ఇంటికే పరిమితం అయితే, పోలీసుల కఠిన చర్యలతో ఇంకొంత మంది బయటకు రావడం లేదు. అత్యవసరం అయితేనే ఈ-పాసులు తీసుకొని మాస్కులు ధరించి మరీ బయటకువస్తున్నారు. కానీ, హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో ఓ యువకుడు పోలీసులకు చుక్కలు చూపించాడు. లాక్‌డౌన్ సమయంలో రోడ్డు మీదకు రావడమే కాకుండా మాస్కు, హెల్మెట్ కూడా […]
దిశ, వెబ్‌డెస్క్: లాక్‌డౌన్ సమయంలో అనవసరంగా రోడ్డు మీదకు వస్తే పోలీసులు కేసులు నమోదు చేస్తూ వాహనాలను సీజ్ చేస్తున్నారు. కరోనా భయంతో సగం మంది ఇంటికే పరిమితం అయితే, పోలీసుల కఠిన చర్యలతో ఇంకొంత మంది బయటకు రావడం లేదు. అత్యవసరం అయితేనే ఈ-పాసులు తీసుకొని మాస్కులు ధరించి మరీ బయటకువస్తున్నారు. కానీ, హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో ఓ యువకుడు పోలీసులకు చుక్కలు చూపించాడు. లాక్‌డౌన్ సమయంలో రోడ్డు మీదకు రావడమే కాకుండా మాస్కు, హెల్మెట్ కూడా ధరించలేదు. ఇదేంటని ప్రశ్నించిన పోలీసులపై బండరాయి విసరబోయాడు. పచ్చిబూతులు తిడుతూ అక్కడి నుంచి పరారీ అయ్యాడు. పోలీసులనే ఎదురిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతున్న దృశ్యాలు మొత్తం స్థానిక యువకులు చిత్రీకరించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.