పేప‌ర్ బోర్డులో క‌రోనా క‌ల‌క‌లం.. మూసివేయాలని ఆందోళన

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని శ్రీ లక్ష్మీ తులసి పేపర్ మిల్లులో క‌రోనా క‌ల‌క‌లం రేపింది. పేపర్ బోర్డులో పనిచేసి ఓ వ్యక్తి రెండ్రోజుల క్రితం ఏపీలోని గుంటూరు జిల్లాకు వెళ్లి వచ్చాడు. అనంతరం ఆయనలో కరోనా లక్షణాలు బయటపడటంతో టెస్టులు చేయించుకోవాల‌ని తోటి కార్మికులు సూచించారు. ఈ మేర‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించుకున్న ఆయ‌న‌కు పాజిటివ్‌గా తేలింది. దీంతో భయబ్రాంతులకు గురైన కాలనీ వాసులు ఫ్యాక్టరీ ఎదుట ఫ్యాక్టరీని మూసివేయాలని ఆందోళన చేస్తున్నారు. […]

Update: 2020-07-18 06:48 GMT

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని శ్రీ లక్ష్మీ తులసి పేపర్ మిల్లులో క‌రోనా క‌ల‌క‌లం రేపింది. పేపర్ బోర్డులో పనిచేసి ఓ వ్యక్తి రెండ్రోజుల క్రితం ఏపీలోని గుంటూరు జిల్లాకు వెళ్లి వచ్చాడు. అనంతరం ఆయనలో కరోనా లక్షణాలు బయటపడటంతో టెస్టులు చేయించుకోవాల‌ని తోటి కార్మికులు సూచించారు. ఈ మేర‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించుకున్న ఆయ‌న‌కు పాజిటివ్‌గా తేలింది. దీంతో భయబ్రాంతులకు గురైన కాలనీ వాసులు ఫ్యాక్టరీ ఎదుట ఫ్యాక్టరీని మూసివేయాలని ఆందోళన చేస్తున్నారు. శ్రీ లక్ష్మి తులసి ఫ్యాక్టరీ యాజమాన్యం, పంచాయితీ సిబ్బంది కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఉన్న కోటర్స్‌ను మొత్తం హైడ్రోక్లోరిక్ ద్రావణంతో శుభ్రం చేసి కుటుంబ సభ్యులను ఐసోలేషన్‌కి తరలించారు.

Tags:    

Similar News