ఎవరిదీ పాపం.. ఆర్ఎంపీ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి..?

దిశ, నేరేడుచర్ల: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గానుగబండ గ్రామానికి చెందిన పంగ విజయ అనే మహిళ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. అదే గ్రామంలోని ఆర్ఎంపీ జానీ అనే వ్యక్తి దగ్గర వైద్యం చేయించుకుంది. ఈ వైద్యం సరిపోదని మెరుగైన వైద్యం అవసరమని ఆర్ఎంపీ జానీ ఖమ్మం పట్టణంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ అన్నీ వైద్యపరీక్షలు చేసిన తర్వాత ఎలాంటి సమస్యలేదని వెనక్కి తిప్పిపంపారు. అయినా విజయకు ఆరోగ్యం కుదుటపడలేదు. రోజురోజూకీ అనారోగ్యం ఎక్కువ […]

Update: 2021-12-01 21:05 GMT

దిశ, నేరేడుచర్ల: సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం గానుగబండ గ్రామానికి చెందిన పంగ విజయ అనే మహిళ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. అదే గ్రామంలోని ఆర్ఎంపీ జానీ అనే వ్యక్తి దగ్గర వైద్యం చేయించుకుంది. ఈ వైద్యం సరిపోదని మెరుగైన వైద్యం అవసరమని ఆర్ఎంపీ జానీ ఖమ్మం పట్టణంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ అన్నీ వైద్యపరీక్షలు చేసిన తర్వాత ఎలాంటి సమస్యలేదని వెనక్కి తిప్పిపంపారు. అయినా విజయకు ఆరోగ్యం కుదుటపడలేదు. రోజురోజూకీ అనారోగ్యం ఎక్కువ అవుతుండడంతో ఖమ్మంలోని వేరే హాస్పిటల్‌ వెళ్లి 15 రోజుల క్రితం చేసిన వైద్య పరీక్షల రిపోర్టును ఆ ఆస్పత్రి వైద్యులకు చూపించింది.

ఆ రిపోర్టులు పరిశీలించిన వైద్యులు విజయ కండీషన్ చాలా సీరియస్‌గా ఉందని, వెంటనే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లాలని సూచించారు. దీంతో విజయను ఆమె కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. కానీ అప్పటికే విజయ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో మృతిచెందింది. మొదటిసారి ఖమ్మం హాస్పిటల్‌లో పరీక్షలు చేయించుకున్న సమయంలోనే అక్కడి వైద్యులు ఆమెను అప్రమత్తం చేసి ఉంటే.. ఆమె ప్రాణాలు దక్కేవని పలువురు గ్రామస్తులు తెలిపారు. ఆర్ఎంపీ నిర్లక్ష్యం వల్లే విజయ ప్రాణాలు కోల్పోయిందని, జానీ ఇంటి ఎదుట మృతదేహంతో బంధువులు ధర్నాకు దిగారు. అయితే పెద్దమనుషుల సమక్షంలో ఈ వ్యవహారాన్ని సెటిల్‌మెంట్ చేసుకున్నట్టు సమాచారం. ఈ విషయంపై ఎలాంటి కేసు నమోదు కాకపోవడం గమనార్హం.

Tags:    

Similar News