చేయి వేస్తే షాకిస్తామంటోన్న యువతి
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలపై ఓ విద్యార్థిని సంచలన నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన పూజాపాటిల్ అనే విద్యార్థిని థింకర్ ఇండియా కార్యక్రమంలో భాగంగా దీనికి శ్రీకారం చుట్టంది. తమను తామే కాపాడుకోవాలని ఎదుటి వ్యక్తి నుంచి కాపాడుకోవడానికి కరెంట్ షాక్ కొట్టే కీచైన్ తయారు చేసింది. ఎవరైనా కేటుగాళ్లు తనపైన చేయి వేయాలని చూస్తే.. వెంటనే కీ చైన్‌కు ఉన్న బటన్ నొక్కడంతో, ఎదుటి వ్యక్తి 440 వాట్ల విద్యుత్ తగిలి […]
దిశ, వెబ్‌డెస్క్: దేశంలో మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలపై ఓ విద్యార్థిని సంచలన నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన పూజాపాటిల్ అనే విద్యార్థిని థింకర్ ఇండియా కార్యక్రమంలో భాగంగా దీనికి శ్రీకారం చుట్టంది. తమను తామే కాపాడుకోవాలని ఎదుటి వ్యక్తి నుంచి కాపాడుకోవడానికి కరెంట్ షాక్ కొట్టే కీచైన్ తయారు చేసింది. ఎవరైనా కేటుగాళ్లు తనపైన చేయి వేయాలని చూస్తే.. వెంటనే కీ చైన్‌కు ఉన్న బటన్ నొక్కడంతో, ఎదుటి వ్యక్తి 440 వాట్ల విద్యుత్ తగిలి సృహ కోల్పోయేలా చేస్తుందని స్పష్టం చేసింది. అయితే దీనిని తన సోదరుడు శివ సహకారంతో కేవలం రూ.300 ఖర్చుచేసి రూపొందించినట్టు తెలిపింది.
దీనిపై థింకర్ ఇండియా వ్యవస్థాపకుడు స్పందించాడు. ఆ విద్యార్థిని తయారు చేసిన కీచైన్‌ను దేశంలోని మహిళలందరికీ అందించాలని భావిస్తోందని, ఆమె కలను తప్పకుండా నిజం చేస్తామని తెలిపారు. ఈ పరికరాన్ని పూజా పేరు మీద పేటెంట్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ కీచైన్ మార్కెట్‌లోకి వచ్చే విధంగా యూపీ ప్రభుత్వంతోపాటు చర్చలు జరుపుతామని ఆయన వెల్లడించారు. దీంతో ఆ విద్యార్థినిని అందరూ అభినందిస్తున్నారు.