ఆ దుర్గామాత విగ్రహంలో స్పెషల్ ఏంటంటే ?
దిశ,నిర్మల్ కల్చరల్: దేవినవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతీఏడాదిలానే, ఈసారికూడా నిర్మల్ మండలం అనంతపేట గ్రామం లో జరుపుకోనున్నారు. అదే గ్రామానికి చెందిన యువకళాకారుడు ‘పోలీస్ భీమేష్’ చేతుల్లో రూపుదిద్దుకున్న పర్యావరణహిత మట్టి దుర్గాదేవి విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రతీ సంవత్సరం రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్, హానికర రంగులు వాడకుండా కేవలం నల్లరేగడి మట్టితోనే అమ్మవారి విగ్రహాన్ని తయారుచేస్తున్నాడు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా స్వచ్చమైన చెరువుమట్టితో విగ్రహం చేయడం ఇది మూడోసారి. దుర్గాదేవి ఆభరణాలు, ఆయుధాలు మొత్తం […]
దిశ,నిర్మల్ కల్చరల్: దేవినవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతీఏడాదిలానే, ఈసారికూడా నిర్మల్ మండలం అనంతపేట గ్రామం లో జరుపుకోనున్నారు. అదే గ్రామానికి చెందిన యువకళాకారుడు ‘పోలీస్ భీమేష్’ చేతుల్లో రూపుదిద్దుకున్న పర్యావరణహిత మట్టి దుర్గాదేవి విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రతీ సంవత్సరం రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్, హానికర రంగులు వాడకుండా కేవలం నల్లరేగడి మట్టితోనే అమ్మవారి విగ్రహాన్ని తయారుచేస్తున్నాడు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా స్వచ్చమైన చెరువుమట్టితో విగ్రహం చేయడం ఇది మూడోసారి. దుర్గాదేవి ఆభరణాలు, ఆయుధాలు మొత్తం మట్టితోనే చేశాడు. ప్రత్యేకత అవసరమైన కొన్నిచోట్ల నీటిరంగులు వాడినట్లు కళాకారుడు భీమేష్ తెలిపారు.