దేశంలో కరోనా ఉగ్రరూపం.. కనీవినీ ఎరుగని రీతిలో కొత్త కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విళయ తాండవం చేస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా మరణాల సంఖ్యను చూస్తుంటే వెన్నులో వణుకుపుడుతోంది. ముఖ్యంగా దేశంలో శనివారం రికార్డు స్థాయిలో అత్యధికంగా కరోనా మరణాలు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా.. గడిచిన 24 గంటల్లో కరోనా మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ఏకంగా 1501 మందిని కరోనా పొట్టనపెట్టుకుంది. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 1,77,150కు చేరింది. ఇక దేశంలో కరోనా కేసులు ప్రమాద ఘంటికలను […]
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విళయ తాండవం చేస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా మరణాల సంఖ్యను చూస్తుంటే వెన్నులో వణుకుపుడుతోంది. ముఖ్యంగా దేశంలో శనివారం రికార్డు స్థాయిలో అత్యధికంగా కరోనా మరణాలు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా.. గడిచిన 24 గంటల్లో కరోనా మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ఏకంగా 1501 మందిని కరోనా పొట్టనపెట్టుకుంది. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 1,77,150కు చేరింది. ఇక దేశంలో కరోనా కేసులు ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి. గత మూడు రోజులుగా రోజుకు రెండు లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతుండగా.. తాజాగా కరోనా మరింత ఉగ్రరూపం దాల్చింది. గడిచిన 24 గంటల్లో 2,61,500 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,47,88,109కు చేరింది. దేశంలో ప్రస్తుతం 18,01,316 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్టు వైద్యాధికారులు తెలిపారు. దీంతో వ్యక్తిగతంగా తప్పక జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఏర్పడిందని హెల్త్ నిపుణులు సూచిస్తున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన ప్రాణాలకే ముప్పు అని హెచ్చరిస్తున్నారు.