అప్పుతో తిరిగొచ్చిన పిల్లి

దిశ, వెబ్‌డెస్క్ :  థాయ్‌లాండ్‌కు చెందిన ఓ వ్యక్తి ఎప్పటి నుంచో ఒక పిల్లిని పెంచుకుంటున్నాడు. అయితే, మూడు రోజుల క్రితం ఇల్లు విడిచి ఎక్కడికో వెళ్లిపోయిన ఆ పిల్లి.. మళ్లీ ఎలాగోలా ఇంటికి తిరిగొచ్చింది. కానీ అప్పు చేసి మరీ రావడం విశేషం. పిల్లి అప్పు చేయడమేంటి? అని ఆశ్చర్యపోతున్నారా? అసలు ఏం జరిగింది? అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లి.. మూడు రోజుల పాటు కనిపించకుండా పోతే ఎవరికైనా బాధగానే ఉంటుంది. ఈ సిచ్యువేషన్‌లో అది క్షేమంగా […]

Update: 2020-11-03 01:03 GMT

దిశ, వెబ్‌డెస్క్ : థాయ్‌లాండ్‌కు చెందిన ఓ వ్యక్తి ఎప్పటి నుంచో ఒక పిల్లిని పెంచుకుంటున్నాడు. అయితే, మూడు రోజుల క్రితం ఇల్లు విడిచి ఎక్కడికో వెళ్లిపోయిన ఆ పిల్లి.. మళ్లీ ఎలాగోలా ఇంటికి తిరిగొచ్చింది. కానీ అప్పు చేసి మరీ రావడం విశేషం. పిల్లి అప్పు చేయడమేంటి? అని ఆశ్చర్యపోతున్నారా? అసలు ఏం జరిగింది?

అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లి.. మూడు రోజుల పాటు కనిపించకుండా పోతే ఎవరికైనా బాధగానే ఉంటుంది. ఈ సిచ్యువేషన్‌లో అది క్షేమంగా ఇంటికి తిరిగొస్తే ఆనందంతో ఉప్పొంగిపోవాలి కదా! కానీ, ఆ పిల్లిని పెంచుకున్న వ్యక్తి మాత్రం షాక్‌కు గురయ్యాడు. ఎందుకంటే.. దాని మెడలో ‘మీ పిల్లి మా షాపులోని మాకెరల్స్‌(తినుబండారం)పై కన్నేసింది. దీంతో నేను దానికి ఓ మూడు మాకెరల్స్‌ ఇచ్చాను’ అని రాసి ఉన్న ఓ ట్యాగ్ ఉంది. ఆంటీ మే అనే మహిళ.. పిల్లికి ఆ ట్యాగ్‌ను తగిలించి దాని మీద తన సైన్ చేయడంతో పాటు అడ్రస్‌ కూడా రాసింది. అలా పిల్లి ఆంటీ మేకు రుణపడింది. దాంతో ఆ పిల్లి అప్పు గాథను.. ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ‘ఓ పిల్లి మూడు రోజులు కనిపించకుండా పోయింది. అప్పులతో తిరిగొచ్చింది’ ఈ ట్యాగ్ లైన్ ఎలా ఉంది? అంటూ షేర్ చేశాడు. ఇది కాస్త వైరల్‌గా మారింది.

Tags:    

Similar News