'సీఎం గారూ.. నా అండర్ వేర్ కి చిల్లులు పడ్డాయి.. కొంచెం షాపులు తెరిపించండి'

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా విలతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి ని కట్టడి చేయడానికి రాష్ట్రాలన్నీ లాక్ డౌన్ ని ప్రకటించాయి. ఎవరు బయటికి రాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. అయితే కొంతమంది ఆకతాయిలు మాత్రం చిన్న చిన్న సిల్లీ రీజన్స్ చెప్పి బయటికి వచ్చి పోలీసుల చేతుల్లో తన్నులు తింటున్నారు. ఇక ఇవన్నీ ఒక ఎత్తయితే లాక్ డౌన్ వలన ఒక వ్యక్తికి  మాత్రం చాలా ఇబ్బంది తలెత్తిందంట. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా […]

Update: 2021-06-02 07:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా విలతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి ని కట్టడి చేయడానికి రాష్ట్రాలన్నీ లాక్ డౌన్ ని ప్రకటించాయి. ఎవరు బయటికి రాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. అయితే కొంతమంది ఆకతాయిలు మాత్రం చిన్న చిన్న సిల్లీ రీజన్స్ చెప్పి బయటికి వచ్చి పోలీసుల చేతుల్లో తన్నులు తింటున్నారు. ఇక ఇవన్నీ ఒక ఎత్తయితే లాక్ డౌన్ వలన ఒక వ్యక్తికి మాత్రం చాలా ఇబ్బంది తలెత్తిందంట. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా సీఎం కి లేఖ రాసి మరీ వివరించాడు. ఇంతకీ అంతటి ఇబ్బంది ఏమొచ్చింది అనేగా డౌట్.. ఈ లాక్ డౌన్ సమయంలో అతని అండర్ వేర్ చినిగిపోయి చిల్లులు పడ్డాయంట.. లాక్ డౌన్ కాబట్టి షాపులు మూసివేయడంతో కొత్తది కొనడానికి వీలులేకుండా పోయిందంట. అందుకే తన ఆవేదనను వివరిస్తూ ఏకంగా సీఎం కే ఓ లేఖ రాసేశాడు. ప్రస్తుతం ఈ లేఖ నెట్టింట వైరల్ గా మారింది.

అత్యధిక తీవ్రత ఉన్న మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో లాక్ డౌన్ కొనసాగుతోంది. లాక్ డౌన్ అమలులో ఉండడం వలన కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం మరికొన్ని రోజులు లాక్ డౌన్ పొడిగించింది. ఇక ఈ నేపథ్యంలో చామరాజపురానికి చెందిన నరసింహమూర్తి తన బాధను వివరిస్తూ సీఎం యడ్యూరప్ప కి ఓ లేఖ రాశాడు. “నా వినతి కాస్త వింతగా అనిపించొచ్చు. కానీ చెప్పక తప్పడం లేదు. ఈ లాక్ డౌన్ సమయంలో నాకున్న జత బనియన్లు అండర్ వేర్ లకు పూర్తిగా చిల్లులు పడిపోయాయి. ఈ లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగే సూచనల నేపథ్యంలో వారానికి ఒకసారైనా దుకాణాలు తెరిచేలా చూడండి.. కొత్తవి కొనుకుంటాను” అంటూ లేఖలో రాసుకొచ్చాడు. ఇంకేముంది ఈ బాబుగారి రాసిన లేఖ ప్రస్తుతం నెట్టింట నవ్వులు పూయిస్తుంది.

Tags:    

Similar News