ఈ చిత్రహింసలకు చావే దిక్కంటూ.. ఓ తల్లి

దిశ, వరంగల్ సిటీ: వరంగల్ పట్టణంలోని శివనగర్‌లో సోమవారం దారుణం చోటు చేసుకుంది. వడ్డీ వ్యాపారి చిత్రహింసలు తట్టుకోలేని మహిళా ఇద్దరు పిల్లలతో కలిసి రైలు పట్టాలపై ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన రైల్వే సిబ్బంది మహిళను అడ్డుకుని స్థానిక మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. బాధితురాలి వివరాల ప్రకారం.. శివనగర్‌లో మంజుల అనే మహిళ వడ్డీ వ్యాపారం చేస్తోంది. అదే ఏరియాకు చెందిన రజితకు పది శాతం వడ్డీతో రూ.50 వేలు అప్పుగా ఇచ్చింది. సుమారు […]

Update: 2020-07-20 06:35 GMT

దిశ, వరంగల్ సిటీ: వరంగల్ పట్టణంలోని శివనగర్‌లో సోమవారం దారుణం చోటు చేసుకుంది. వడ్డీ వ్యాపారి చిత్రహింసలు తట్టుకోలేని మహిళా ఇద్దరు పిల్లలతో కలిసి రైలు పట్టాలపై ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన రైల్వే సిబ్బంది మహిళను అడ్డుకుని స్థానిక మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. బాధితురాలి వివరాల ప్రకారం.. శివనగర్‌లో మంజుల అనే మహిళ వడ్డీ వ్యాపారం చేస్తోంది. అదే ఏరియాకు చెందిన రజితకు పది శాతం వడ్డీతో రూ.50 వేలు అప్పుగా ఇచ్చింది. సుమారు ఇరవై నెలలుగా పది శాతం వడ్డీ చెల్లించిన రజిత కరోనా టైమ్‌లో డబ్బులు రావడం లేదని కొంచెం గడువు కోరింది. అంగీకరించని మంజుల ఇండ్లలో కూలీ పని చేసే రజితపై మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో ఎస్సై ఇద్దరి సంభాషణ విని పదిశాతం వడ్డీ ఎలా తీసుకుంటావ్ అని మంజులను హెచ్చరించి బయటికి పంపించారు. అయినప్పటికీ వడ్డీ వ్యాపారి స్థానిక బీజేపీ నాయకుడి సహకారంతో డబ్బులు చెల్లించాలని రజితను పంచాయితీకి పిలిపించింది. దీంతో బాధితురాలు మంజుల పెట్టే చిత్రహింసలకు చావే దిక్కంటూ ఇద్దరు పిల్లలతో వరంగల్ రైల్వే స్టేషన్లో రైలు పట్టాల పైకి వెళ్ళి ఆత్మహత్యకు యత్నించింది. అదే సమయంలో అక్కడ ఉన్న రైల్వే సిబ్బంది ఆమెను అడ్డుకుని స్థానిక మిల్స్ కాలనీ పోలిస్ స్టేషన్లో అప్పగించారు. పోలీసులు కేసు విచారిస్తున్నారు.

Tags:    

Similar News