బర్గర్స్ తినడానికి..ప్రైవేట్ చాపర్

దిశ, వెబ్‌డెస్క్: దక్షిణ బెంగళూరులోని తుమకూరుకు చెందిన రైస్ మిల్ ఓనర్ నిరూప్ తన పెళ్లికి హెలికాప్టర్‌లో వెళ్లి అందర్నీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలు ఇంతకు ముందు జరిగాయి. అయితే ఇటీవల ఓ వ్యక్తి సమీప ప్రాంతంలో బర్గర్స్ తినడానికి ఒక ప్రైవేట్ హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకున్నాడు. వివరాల్లోకెళితే.. రష్యాకు చెందిన మిలియనీర్ విక్టర్ మార్టినోవ్ తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి క్రిమియాలోని అలుష్తా‌కు హాలీడేస్ ఎంజాయ్ చేయడానికి వెళ్లాడు. అక్కడ దొరికే లోకల్ ఫుడ్ […]

Update: 2020-12-04 03:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: దక్షిణ బెంగళూరులోని తుమకూరుకు చెందిన రైస్ మిల్ ఓనర్ నిరూప్ తన పెళ్లికి హెలికాప్టర్‌లో వెళ్లి అందర్నీ ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలు ఇంతకు ముందు జరిగాయి. అయితే ఇటీవల ఓ వ్యక్తి సమీప ప్రాంతంలో బర్గర్స్ తినడానికి ఒక ప్రైవేట్ హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకున్నాడు. వివరాల్లోకెళితే..

రష్యాకు చెందిన మిలియనీర్ విక్టర్ మార్టినోవ్ తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి క్రిమియాలోని అలుష్తా‌కు హాలీడేస్ ఎంజాయ్ చేయడానికి వెళ్లాడు. అక్కడ దొరికే లోకల్ ఫుడ్ వారికి అంతగా నచ్చలేదు. అప్పటి వరకు ఆర్గానిక్ ఫుడ్ తిని వారికి బోర్ కొట్టింది. మెక్‌డోనల్డ్స్ మీల్ తినాలనిపించడంతో, అలుష్తాలో మెక్ డోనాల్డ్స్ ఔట్‌లెట్ కోసం చూశారు. అక్కడ లేకపోవడంతో, దగ్గర్లో ఎక్కడ ఉందో ఆన్‌లైన్‌లో వెతకగా, 450 మైళ్ల దూరంలో క్రస్నోడర్‌‌లో ఉన్నట్లు గూగుల్ చూపించింది. మార్టినోవ్ వెంటనే అక్కడికి వెళ్లడానికి ఓ ప్రైవేట్ చాపర్ బుక్ చేశాడు. బర్గర్స్, ఫ్రైస్, మిల్క్ షేక్‌లు ఆర్డర్ చేసి, వాటిని తీసుకుని మళ్లీ రిటర్న్ అయ్యాడు. అతడి మెక్ ‌డోనాల్డ్స్ బిల్ కేవలం 49 పౌండ్స్ (రూ.4,860) కాగా, ప్రైవేట్ చాపర్ అద్దెకు 2వేల పౌండ్లు (రూ. 1,98,400) అయ్యాయి.

మార్టినోవ్ మాస్కోకు చెందిన ఓ కంపెనీకి సీఈవోగా చేస్తున్నాడు. ఆ కంపెనీ హెలికాప్టర్స్ సెల్ చేస్తుందని జాతీయ మీడియా తెలిపింది. కాగా, ప్రస్తుతం మార్టినోవ్ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 2014 నుంచి క్రిమియాలో ఫాస్ట్ ఫుడ్ స్టోర్స్ బ్యాన్ చేయడంతో, అక్కడ మెక్ డోనాల్డ్స్ స్టోర్ లేదు.

Tags:    

Similar News