మన కూతురికి పెళ్లి ఎందుకు..? తనను కూడా నేనే పెళ్లి చేసుకుంటా..
దిశ, వెబ్‌డెస్క్: రోజురోజుకు కామాంధుల చేష్టలు ఎక్కువైపోతున్నాయి. కామ కోరికలతో మగాళ్లు మృగాళ్ళుగా మారుతున్నారు. వివాహేతర సంబంధాలు కొనసాగిస్తూనే మరో అమ్మాయి కావాలంటూ వేధిస్తున్నారు. తాజాగా ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ కామాంధుడు ఆమె కూతురు కూడా తనతో ఉండాలని తల్లీకూతుళ్లను చిత్రహింసలకు గురిచేసిన ఘటన గుంటూరులో వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే.. మంగళగిరికి చెందిన ఓ మహిళ(38) భర్తతో విడిపోయి కూతురుతో (21) కలిసి నివాసముంటుంది. అయితే ఆ మహిళకు కొన్ని రోజుల […]
దిశ, వెబ్‌డెస్క్: రోజురోజుకు కామాంధుల చేష్టలు ఎక్కువైపోతున్నాయి. కామ కోరికలతో మగాళ్లు మృగాళ్ళుగా మారుతున్నారు. వివాహేతర సంబంధాలు కొనసాగిస్తూనే మరో అమ్మాయి కావాలంటూ వేధిస్తున్నారు. తాజాగా ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ కామాంధుడు ఆమె కూతురు కూడా తనతో ఉండాలని తల్లీకూతుళ్లను చిత్రహింసలకు గురిచేసిన ఘటన గుంటూరులో వెలుగు చూసింది.
వివరాలలోకి వెళితే.. మంగళగిరికి చెందిన ఓ మహిళ(38) భర్తతో విడిపోయి కూతురుతో (21) కలిసి నివాసముంటుంది. అయితే ఆ మహిళకు కొన్ని రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన సాంబశివరావు (42) అనే వ్యక్తితో పరిచయమయ్యింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. వారిద్దరి సంబంధం కూతురికి తెలిసినా తల్లికోసం ఏమీ మాట్లాడలేదు. దీంతో అతను తల్లితో పాటు కూతురు బాగోగులు కూడా చూడడం మొదలుపెట్టాడు. అయితే కూతురికి పెళ్లి వయసు రావడంతో మహిళ పెళ్లి చేయాలని నిర్ణయించింది. అంతేకాకుండా సాంబశివరావుకు తెలియకుండా సంబంధాలు కూడా చూడడం మొదలుపెట్టింది. ఈ విషయం తెలుసుకున్న సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన కూతురికి వివాహం చేయడం ఇష్టం లేదని, తనని తానే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో తల్లీకూతుళ్లు షాక్ అయ్యారు.
యువతి తనను తండ్రిలా చూశానని, తల్లితో సహజీవనం చేస్తూ నన్నెలా పెళ్లిచేసుకుంటావని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కోపోద్రిక్తుడైన సాంబశివరావు తల్లీకూతుళ్లను ఇంట్లోనే బంధించి చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే బుధవారం యువతిని బెల్ట్‌తో చితకబాదాడు. ఇది చూసి యువతి తల్లి తట్టుకోలేకపోయింది. చివరకు అక్కడి నుంచి బయటపడిన తల్లీ, కూతురు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.