ఉద్యోగంలో సెలవు కోసం.. భార్యకు విడాకులు…

దిశ, వెబ్ డెస్క్: మాములుగా ప్రభుత్వ ఉద్యోగమంటే సెలవుకోసం ఇబ్బంది పడాల్సిన పనేమీ ఉండదు.. కానీ ప్రైవేట్ ఉద్యోగం చేసే వాళ్ళు సెలవు కావాలంటే బాస్ ను ఒప్పించి, మెప్పించి సెలవు పెట్టాలి. లేదంటే వర్క్ చాలా ఉంది కుదరదు అంటూ సెలవును ఎక్కడ పక్కన పెట్టేస్తారోనని భయం.. అలాంటి ఆలోచనతోనే ఓ వ్యక్తి సెలవుల కోసం ఏకంగా భార్యకు విడాకులు ఇచ్చాడు. అది కూడా ఒక్కసారి కాదు.. మూడు సార్లు.. అదేంటి మూడు సార్లు విడాకులు […]

Update: 2021-04-14 23:29 GMT

దిశ, వెబ్ డెస్క్: మాములుగా ప్రభుత్వ ఉద్యోగమంటే సెలవుకోసం ఇబ్బంది పడాల్సిన పనేమీ ఉండదు.. కానీ ప్రైవేట్ ఉద్యోగం చేసే వాళ్ళు సెలవు కావాలంటే బాస్ ను ఒప్పించి, మెప్పించి సెలవు పెట్టాలి. లేదంటే వర్క్ చాలా ఉంది కుదరదు అంటూ సెలవును ఎక్కడ పక్కన పెట్టేస్తారోనని భయం.. అలాంటి ఆలోచనతోనే ఓ వ్యక్తి సెలవుల కోసం ఏకంగా భార్యకు విడాకులు ఇచ్చాడు. అది కూడా ఒక్కసారి కాదు.. మూడు సార్లు.. అదేంటి మూడు సార్లు విడాకులు ఇవ్వడమేంటని అనుకుంటున్నారా.. తైవాన్ దేశంలో ఆ దేశ లేబర్ చట్టాల ప్రకారం ఎవరైనా ఉద్యోగి పెళ్లి చేసుకుంటే ఎనిమిది రోజుల వేతనంతో కూడిన సెలవును మంజూరు చేయాల్సి ఉంటుంది. అయితే సరిగ్గా ఇదే అంశాన్ని తైపై నగరంలోని ఓ బ్యాంకులో క్లర్క్ గా పనిచేస్తున్న వ్యక్తి తన సెలవుల కోసం వినియోగించుకున్నాడు.

గత సంవత్సరం ఏప్రిల్ 6న అతడు ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికోసం అతడు నిబంధనల ప్రకారం ఎనిమిది రోజుల సెలవు కోసం బ్యాంకులో దరఖాస్తు చేసుకున్నాడు. ఎనిమిది రోజుల సెలవు పూర్తి చేసుకున్న తర్వాత తొమ్మిదవ రోజు తన భార్యకు అతడు విడాకులు ఇచ్చాడు. పదో రోజు మళ్లీ బ్యాంకు కు వచ్చి పెళ్లిచేసుకుంటున్నట్లు చెప్పి సెలవు తీసుకున్నాడు. ఇలా 3 సార్లు విడాకులు ఇచ్చి 4సార్లు పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం గ్రహించిన బ్యాంకు అధికారులు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వడం కుదరది చెప్పడంతో, తైపై నగరంలోని లేబర్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ ఆఫీసులో ఓ పిటిషన్ ను దాఖలు చేశాడు. దీంతో బ్యాంకు అధికారులకు షాక్ ఇస్తూ.. అక్కడి న్యాయస్థానం ఆ క్లర్క్ నీతిమాలిన పనికి పూనుకున్నప్పటికీ నిబంధనలను మాత్రం అతడు అతిక్రమించలేదని తీర్పునిచ్చింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ.. పై కోర్టుకు అప్పీల్ చేయగా అక్కడ కూడా బ్యాంకు అధికారులకు చుక్కెదురే అయ్యింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.

Tags:    

Similar News