జిల్లాలో తొలిసారి ఆ నియోజకవర్గంలోనే!

దిశ, సంగారెడ్డి: రాష్ట్రంలో కరోనా మరణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో మృతదేహాలను ఖననం చేయడం బంధువులకు కష్టంగా మారింది. అంత్యక్రియలు నిర్వహించడం కష్టంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో దహన యంత్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. కాగా కరోనా పరిస్థితుల అనంతరం కూడా వినియోగించుకునేలా ప్రయత్నం ఏర్పాటు చేస్తున్నారు. గ్యాస్, డీజిల్ సహాయంతో ఈ యంత్రాన్ని నిర్వహించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గ్యాస్, డీజిల్ సాయంతో నడిచే దహన యంత్రాలను 12 […]

Update: 2020-08-11 09:27 GMT

దిశ, సంగారెడ్డి: రాష్ట్రంలో కరోనా మరణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో మృతదేహాలను ఖననం చేయడం బంధువులకు కష్టంగా మారింది. అంత్యక్రియలు నిర్వహించడం కష్టంగా మారుతున్న ప్రస్తుత తరుణంలో.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో దహన యంత్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. కాగా కరోనా పరిస్థితుల అనంతరం కూడా వినియోగించుకునేలా ప్రయత్నం ఏర్పాటు చేస్తున్నారు.

గ్యాస్, డీజిల్ సహాయంతో ఈ యంత్రాన్ని నిర్వహించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గ్యాస్, డీజిల్ సాయంతో నడిచే దహన యంత్రాలను 12 చోట్ల అమర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో యంత్రం విలువ రూ.45 లక్షలు ఉంటుందని సమాచారం. అక్కడ షెడ్డుతో పాటు యంత్రాన్ని అమర్చేందుకు ప్రత్యేక నిర్మాణం చేపడతారు. హర్యాణ నుంచి ఈ యంత్రాలను, తెప్పిస్తుండగా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తొలి యంత్రం పటాన్‌చెరుకు తీసుకొచ్చారు. ఇది మరో 15 రోజుల్లో అందుబాటులోకి రానుందని అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News