వామ్మో.. మార్కెట్లో మునగకాయ ధర ఎంతో తెలుసా ?
దిశ, వెబ్‌డెస్క్ : ఎవరు మార్కెట్లోకి వెళ్లినా మునగకాయలను కొనడం మర్చిపోరు అనడంలో అతిశయోక్తి లేదు. మునగకాయల కర్రీ అంటే ఇష్టపడని వారుండరు. ఇక సాంబర్‌లో మునగకాయలను లొట్టలేసుకొని మరీ తింటారు. అంతే కాకుండా మార్కెట్లో కూడా మునగకాయలకు మంచి డిమాండ్ ఉంటుంది. కానీ ఆ జిల్లాలో మునగకాయల ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే. బంగారం ధరలా పెరిగిపోయింది. ఇంతకీ ఎక్కడా అనుకుంటున్నారా.. ? చిత్తూరు జిల్లా మదనపల్లె కూరగాయల మార్కెట్ చరిత్రలో ఎన్నడూ కనీవిని ఎరుగని […]
దిశ, వెబ్‌డెస్క్ : ఎవరు మార్కెట్లోకి వెళ్లినా మునగకాయలను కొనడం మర్చిపోరు అనడంలో అతిశయోక్తి లేదు. మునగకాయల కర్రీ అంటే ఇష్టపడని వారుండరు. ఇక సాంబర్‌లో మునగకాయలను లొట్టలేసుకొని మరీ తింటారు. అంతే కాకుండా మార్కెట్లో కూడా మునగకాయలకు మంచి డిమాండ్ ఉంటుంది. కానీ ఆ జిల్లాలో మునగకాయల ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే. బంగారం ధరలా పెరిగిపోయింది. ఇంతకీ ఎక్కడా అనుకుంటున్నారా.. ?
చిత్తూరు జిల్లా మదనపల్లె కూరగాయల మార్కెట్ చరిత్రలో ఎన్నడూ కనీవిని ఎరుగని రీతిలో మునగకాయల ధర పలికింది. కిలో మునగకాయల ధర ఏకంగా రూ.600 పలకడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. దీంతో సామన్యులకు ఈ మునగకాయలు కొనగలరా అంటున్నారు కొందరు. ఏ మార్కెట్లో అయినా రూ. రూ.15 కు ఒకటి చొప్పున కొంటారు, లేదంటే కిలో చొప్పున మునగకాయ సైజును బట్టి 12 నుంచి 16 తూగుతాయి దీంతో ఒక మునగకాయకు రూ.10 చొప్పున ఇచ్చి తీసుకున్న రోజులున్నాయి. కానీ ప్రస్తుతం మదనపల్లె మార్కెట్లో మాత్రం ఒక్క మునగకాయ ధర రూ. 30కి పైనే పలికినట్టు తెలుస్తోంది. అయితే మదనపల్లె పరిసరప్రాంతాల్లోని మునగచెట్లు వర్షాలకు పూర్తిగా దెబ్బతినడంతో తమిళనాడు నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. గత నెలలో భారీ వర్షాల కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని, పంట పూర్తిగా దెబ్బతినడంతో మునగకాయల ధర పెరిగినట్టు రైతులు తెలుపుతున్నారు. ఏదిఎమైనా మునగకాయ కొనాలంటే ఇక కష్టమే మరీ.