వివేకా హత్య కేసులో సీబీఐ కీలక ముందడుగు..

దిశ, ఏపీ బ్యూరో: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్‌లో 92వ రోజు అయిన సోమవారం పలువురు అనుమానితులను ప్రశ్నించారు. అయితే విచారణలో భాగంగా అనంతపురం జిల్లా కదిరికి చెందిన కృష్ణమాచార్యులను ప్రొద్దుటూరు కోర్టుకు తీసుకెళ్లారు. అక్కడ మెజిస్ట్రేట్‌ ఎదుట కృష్ణమాచార్యులను హాజరుపరిచారు. ఈ క్రమంలో 164 సెక్షన్‌ కింద వాంగ్మూలం నమోదు చేశారు. కృష్ణమాచార్యులు కదిరిలో హార్డ్‌వేర్‌ దుకాణం నిర్వహిస్తున్నాడు. హత్య కేసు […]

Update: 2021-09-06 08:34 GMT

దిశ, ఏపీ బ్యూరో: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్‌లో 92వ రోజు అయిన సోమవారం పలువురు అనుమానితులను ప్రశ్నించారు. అయితే విచారణలో భాగంగా అనంతపురం జిల్లా కదిరికి చెందిన కృష్ణమాచార్యులను ప్రొద్దుటూరు కోర్టుకు తీసుకెళ్లారు. అక్కడ మెజిస్ట్రేట్‌ ఎదుట కృష్ణమాచార్యులను హాజరుపరిచారు. ఈ క్రమంలో 164 సెక్షన్‌ కింద వాంగ్మూలం నమోదు చేశారు. కృష్ణమాచార్యులు కదిరిలో హార్డ్‌వేర్‌ దుకాణం నిర్వహిస్తున్నాడు. హత్య కేసు విచారణలో భాగంగా సీబీఐ పలుమార్లు కృష్ణమాచార్యులను ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

 

Tags:    

Similar News