మహారాష్ట్ర నుంచి మాంచెస్టర్‌కు ప్రయాణించిన ఓ కుర్చీ కథ!
దిశ, ఫీచర్స్: టెలివిజన్‌లో ప్రసారమయ్యే ఫెవిక్విక్ యాడ్ చూసే ఉంటారు. అందులో ఓ సోఫా ఎన్నో ఊర్లు మారుతుంటుంది. అలా ఇల్లు మారినప్పుడల్లా, యజమాని టేస్ట్‌కు తగ్గట్లు దాని అలంకరణ కూడా మారిపోతుంది. ఇది రీల్ కథ కాగా, ప్రస్తుతం అలానే ఓ కుర్చీ మహారాష్ట్ర నుంచి మాంచెస్టర్ వరకు వెళ్లింది. గత రెండేళ్లుగా మనలో చాలామంది ఇంట్లో బందీలుగా ఉన్నప్పటికి, మెటల్ కుర్చీ మాత్రం ఖండాలు దాటింది. ఇంటర్నెట్ దృష్టిని ఆకర్షించిన ఆ కుర్చీ జర్నీ […]
దిశ, ఫీచర్స్: టెలివిజన్‌లో ప్రసారమయ్యే ఫెవిక్విక్ యాడ్ చూసే ఉంటారు. అందులో ఓ సోఫా ఎన్నో ఊర్లు మారుతుంటుంది. అలా ఇల్లు మారినప్పుడల్లా, యజమాని టేస్ట్‌కు తగ్గట్లు దాని అలంకరణ కూడా మారిపోతుంది. ఇది రీల్ కథ కాగా, ప్రస్తుతం అలానే ఓ కుర్చీ మహారాష్ట్ర నుంచి మాంచెస్టర్ వరకు వెళ్లింది. గత రెండేళ్లుగా మనలో చాలామంది ఇంట్లో బందీలుగా ఉన్నప్పటికి, మెటల్ కుర్చీ మాత్రం ఖండాలు దాటింది. ఇంటర్నెట్ దృష్టిని ఆకర్షించిన ఆ కుర్చీ జర్నీ ఎలా సాగిందో తెలుసుకుందాం.
క్రికెటర్‌గా మారిన జర్నలిస్ట్ సునందన్ లేలే.. ఇటీవలే ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ సిటీని సందర్శించాడు. కాగా స్థానిక రెస్టారెంట్‌లోని ఓపెన్ సీటింగ్ ఏరియాలో గల ఒక కుర్చీ అతన్ని బాగా ఆకర్షించింది. ఇనుముతో ఉన్న ఆ కుర్చీ వెనక భాగంలో మరాఠీలో ‘బాలు లోఖండే’ అని రాసి ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే ఆ కుర్చీని వీడియోను తీసి ‘ఇది వింత కాదా’ అనే టైటిల్‌తో తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో పంచుకున్నాడు. వేలాదిమంది నెటిజన్లను ఈ వీడియో ఆకర్షించగా, మహారాష్ట్రలోని ఈ కుర్చీ 7,461 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాంచెస్టర్ వరకు ఎలా ప్రయాణించిందో అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. చాలా సంవత్సరాల క్రితం ‘బాలు లోఖండే’ అనే టెంట్ షాప్ యజమాని విక్రయించిన స్క్రాప్‌లో ఈ కుర్చీ ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత మహారాష్ట్రలోని సాంగ్లీ నుంచి మాంచెస్టర్‌లోని ఆల్ట్రించమ్(Altrincham) ప్రాంతానికి చేరుకున్నట్లు సమాచారం.
Altrincham , Manchester che बाळू लोखंडे 🤣🤔💪 आहे की नाही अजब pic.twitter.com/es5Jhe1sP6
— Sunandan Lele (@sunandanlele) September 23, 2021
‘మరాఠీ ప్రజలు ప్రతిచోటా ఉన్నారు. ఇది నిజంగానే అద్భుతం. ఇంతకీ ఈ పేరు ఉన్న కుర్చీని ఎవరు తీసుకెళ్లారో నాకు ఇంకా ఆశ్చర్యంగా ఉంది! ఇది భారతదేశం నుంచి బ్రిటిష్ వారు మరొక నిధిని దోచుకున్న సందర్భం కాదని నేను ఆశిస్తున్నాను’ అని ఓ నెటిజన్ సరదాగా ట్వీట్‌గా చేయగా.. ‘మరాఠీ ప్రజలు ఎక్కడా తక్కువ కాదు.. సాంగ్లీ కుర్చీ నేరుగా లండన్‌కు వెళ్లింది’ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.