ఏడాదిన్నరగా సొంత కూతురిపైనే అత్యాచారం

దిశ వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో దారుణం వెలుగుచూసింది. సొంత కూతురిపైనే ఏడాదిన్నరగా అత్యాచారానికి పాల్పడుతున్న ఒక రాక్షస తండ్రిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. తండ్రి మధ్య వయస్కుడు కాగా.. కూతురు ప్రస్తుతం 6వ తరగతి చదువుతోంది. తల్లి, కూతురు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడాదిన్నరగా సొంత కూతురిపైనే తండ్రి అత్యాచారం చేస్తుండగా.. తల్లి, కూతురు మొన్నటివరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. తల్లి బయటికి వెళ్లిన సమయంలో కూతురిపై తండ్రి అత్యాచారానికి […]

Update: 2021-03-04 02:42 GMT

దిశ వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో దారుణం వెలుగుచూసింది. సొంత కూతురిపైనే ఏడాదిన్నరగా అత్యాచారానికి పాల్పడుతున్న ఒక రాక్షస తండ్రిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. తండ్రి మధ్య వయస్కుడు కాగా.. కూతురు ప్రస్తుతం 6వ తరగతి చదువుతోంది. తల్లి, కూతురు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఏడాదిన్నరగా సొంత కూతురిపైనే తండ్రి అత్యాచారం చేస్తుండగా.. తల్లి, కూతురు మొన్నటివరకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. తల్లి బయటికి వెళ్లిన సమయంలో కూతురిపై తండ్రి అత్యాచారానికి పాల్పడేవాడని పోలీసుల విచారణలో తేలింది.

ఫిబ్రవరి 28న తన కూతురిపై తండ్రి అత్యాచారం చేయగా.. బాధితురాలు ఇటీవల తన తల్లికి ఈ విషయం చెప్పింది. దీంతో బంధువులందరూ కలిసి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలికి మెడికల్ టెస్టులు చేయగా.. అత్యాచారానికి గురైనట్లు తేలింది.

Tags:    

Similar News