Crime News: మహిళా పోలీస్ అధికారిణిపై కన్నేసిన కానిస్టేబుల్.. బాత్ రూంలో కెమెరా పెట్టి..

దిశ, వెబ్‌డెస్క్ : మహిళలను వేధిస్తే కఠిన శిక్షలు విధిస్తున్నా.. కామాంధుల్లో మార్పు రావడం లేదు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు నిత్యం లైంగిక వేధింపులకు గురవుతున్నారు. వీళ్లే కాకుండా ఆఫీసుల్లో మహిళా ఉద్యోగినులు సైతం లైంగిక హింసకు బాధితులుగా మారుతున్నారు. అయితే ఓ కానిస్టేబుల్ బరి తెగించి వ్యవహరించాడు. చట్టం రక్షణలో భాగస్వామ్యం అయ్యే అతగాడు ఏకంగా పోలీస్ శాఖలో ఉన్నతాధికారిగా విధులు నిర్వహిస్తున్న మహిళపైనే కన్నేసి బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ […]

Update: 2021-09-28 05:53 GMT

దిశ, వెబ్‌డెస్క్ : మహిళలను వేధిస్తే కఠిన శిక్షలు విధిస్తున్నా.. కామాంధుల్లో మార్పు రావడం లేదు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు నిత్యం లైంగిక వేధింపులకు గురవుతున్నారు. వీళ్లే కాకుండా ఆఫీసుల్లో మహిళా ఉద్యోగినులు సైతం లైంగిక హింసకు బాధితులుగా మారుతున్నారు. అయితే ఓ కానిస్టేబుల్ బరి తెగించి వ్యవహరించాడు. చట్టం రక్షణలో భాగస్వామ్యం అయ్యే అతగాడు ఏకంగా పోలీస్ శాఖలో ఉన్నతాధికారిగా విధులు నిర్వహిస్తున్న మహిళపైనే కన్నేసి బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డాడు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

భోపాల్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా పోలీస్ అధికారిణి దగ్గర కారు డ్రైవర్‌గా కానిస్టేబుల్ పని చేస్తున్నాడు. అయితే పై అధికారిణి, పోలీస్ డిపార్ట్ మెంట్ అన్న భయం, గౌరవం కూడా లేకుండా ఆమె బాత్ రూంలో కెమెరా పెట్టి ఆమె నగ్న చిత్రాలను రికార్డు చేశాడు. ఈ క్రమంలో ఈ నెల 22న బాత్ రూం డోర్‌పై రికార్డింగ్‌లో ఉన్న సెల్ ఫోన్‌ను గుర్తించిన ఆ మహిళా అధికారిని వెంటనే బయటకు వచ్చింది. ఆమెను చూసిన సదరు కానిస్టేబుల్ సెల్ తీసుకోని వెంటనే అక్కడి నుంచి పరారీ అయ్యాడు.

అయితే ఘటన జరిగిన తర్వాత ఈనెల 26న తిరిగి వచ్చిన కానిస్టేబుల్.. అధికారిణికి క్షమాపణలు కూడా చెప్పకుండా రూ.5 లక్షలు ఇస్తేనే వీడియోలు డిలీట్ చేస్తానని, లేకపోతే సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డాడు. దీంతో ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన భోపాల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా.. నిందితుడు నేరగా హబీబ్ గంజ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తనపై ఎస్పీ రామ్జీ శ్రీవాస్తవ, క్రైం బ్రాంచ్ పోలీసులు దాడికి పాల్పడ్డారని ఫిర్యాదు చేయడం గమనార్హం.

Tags:    

Similar News