ఒళ్లు గగుర్పుడిచే ఘటన.. చిన్నారి మెడకు చుట్టుకున్న నాగుపాము.. రెండు గంటలపాటు

దిశ, వెబ్‌డెస్క్: ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనిదే జీవితం అంటే.. ప్రమాదం ఎప్పుడు.. ఏ రూపం లో వస్తుందో చెప్పడం ఎవరి తరం కాదు. తాజాగా ఒక చిన్నారికి కూడా అనుకోని ప్రమాదం ఎదురయ్యింది.  హాయిగా నిద్రపోతున్న చిన్నారికి కూడా తెలిసి ఉండదు ఇలాంటి ఒక ప్రమాదం తనను ముట్టడిస్తోందని.. ఆ ఘటన చూసినవారికే కాదు విన్నవారికి కూడా ముచ్చెమటలు పడతాయి. ఇంతకీ ఆ ప్రమాదం ఏంటంటే.. ఒక ఏడేళ్ల చిన్నారిని ఓ నాగుపాము కాటేసింది. నిద్రిస్తున్న […]

Update: 2021-09-12 22:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనిదే జీవితం అంటే.. ప్రమాదం ఎప్పుడు.. ఏ రూపం లో వస్తుందో చెప్పడం ఎవరి తరం కాదు. తాజాగా ఒక చిన్నారికి కూడా అనుకోని ప్రమాదం ఎదురయ్యింది. హాయిగా నిద్రపోతున్న చిన్నారికి కూడా తెలిసి ఉండదు ఇలాంటి ఒక ప్రమాదం తనను ముట్టడిస్తోందని.. ఆ ఘటన చూసినవారికే కాదు విన్నవారికి కూడా ముచ్చెమటలు పడతాయి. ఇంతకీ ఆ ప్రమాదం ఏంటంటే.. ఒక ఏడేళ్ల చిన్నారిని ఓ నాగుపాము కాటేసింది. నిద్రిస్తున్న చిన్నారి మెడకు చుట్టుకొని 2 గంటల పాటు కదలకుండా ఉండిపోయింది. అది చూసిన వారికి ముచ్చెమటలు పట్టాయి. ఈ ఘటన మహారాష్ట్ర వార్దాలో వెలుగుచూసింది.

వివరాలలోకి వెళితే వార్ధాలోని సేలు పట్టణంలో ఏడేళ్ల చిన్నారి దివ్యానీ గడ్కరీ ఇంట్లో హాయిగా పడుకుంది. అయితే.. ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు కానీ.. ఓ నాగుపాము ఇంట్లోకి ప్రవేశించింది. నిద్రపోతున్న చిన్నారి మెడకు చుట్టేసుకొని బుసలు కొట్టడం మొదలుపెట్టింది. ఆ శబ్దాలు విన్న కుటుంబ సభ్యులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కొద్ది క్షణాల పాటు వారికి ఏమీ చేయాలో అర్ధం కాలేదు. అనంతరం తేరుకున్న వారు పామును పట్టుకునేందుకు ఎన్నో రకాలు ప్రయత్నించారు. అయినా.. వారి ప్రయత్నం వృధానే అయ్యింది. పాము అక్కడ నుంచి కదల్లేదు. అలా రెండు గంటలు గడిచింది. చిన్నారితో పాటు అక్కడ ఉన్నవారందరూ భయంతో వణికిపోయారు. అయితే రెండు గంటలపాటు కదలకుండా ఉన్న బాలిక కొద్దిగా కదిలింది. దీంతో నాగుపాము.. దివ్యానీ చేయిపై కాటు వేసి వెళ్లిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు దివ్యానీని సేవాగ్రామ్​లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలిక ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Tags:    

Similar News