ఆయిల్‌పామ్‌ సాగుతో రైతులకు ఉజ్వల భవిష్యత్తు: మంత్రి హరీష్ రావు

దిశ, సిద్ధిపేట: ఆయిల్‌పామ్‌ సాగుతో రైతులకు ఉజ్వల భవిష్యత్తు ఉన్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. ఈ పంటల సాగుతో రైతులకు సుస్థిర ఆదాయం వస్తుందని తద్వారా ఆర్థిక భరోసా కలుగుతుందని తెలిపారు. వచ్చే 15 రోజుల్లో సిద్దిపేట జిల్లాలోని 18 వందల ఎకరాల్లో ఆయిల్ ప్లాంట్ మొక్కలను నాటాలని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు వ్యవసాయ అధికారులు ఆదేశించారు. సోమవారం […]

Update: 2021-12-13 11:08 GMT

దిశ, సిద్ధిపేట: ఆయిల్‌పామ్‌ సాగుతో రైతులకు ఉజ్వల భవిష్యత్తు ఉన్నదని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. ఈ పంటల సాగుతో రైతులకు సుస్థిర ఆదాయం వస్తుందని తద్వారా ఆర్థిక భరోసా కలుగుతుందని తెలిపారు. వచ్చే 15 రోజుల్లో సిద్దిపేట జిల్లాలోని 18 వందల ఎకరాల్లో ఆయిల్ ప్లాంట్ మొక్కలను నాటాలని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు వ్యవసాయ అధికారులు ఆదేశించారు. సోమవారం హైదరాబాదులోని అరణ్య భవన్ నుంచి సిద్ధిపేట జిల్లా వ్యవసాయ, ఉద్యాన పట్టు పరిశ్రమ, ఆయిల్ ఫెడ్ అధికారులతో రాష్ట్ర మంత్రి తన్నీరు హరీష్ రావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి.. AEO క్లస్టర్ వారీగా ఆయిల్ పామ్, మల్బరీ తోటల సాగు లక్ష్యాలను నిర్దేశించారు. రంగనాయక సాగర్ వద్ద ఒక లక్ష ఆయిల్ పామ్ మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నాయని మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు.

18 వందల ఎకరాల్లో నాటేందుకు ఈ మొక్కలు సరిపోతాయని అన్నారు. వచ్చే పక్షం రోజుల్లో అనువైన భూముల్లో ఒక లక్ష మొక్కలను నాటాలన్నారు. అలాగే జిల్లాలోని వ్యవసాయ విస్తరణ అధికారులు తమ తమ క్లస్టర్ పరిధిలోని రైతులతో సమావేశం నిర్వహించి , చైతన్యం చేసి కనీసం 15 ఎకరాల ను ఆయిల్ ఫామ్ సాగు, 2 ఎకరాలలో మల్బరీ తోటల సాగు కోసం అనువైన భూములను గుర్తించాలన్నారు. ఔత్సాహిక రైతు పేరు, సర్వే నెంబర్ వంటి వివరాలను ఉద్యానవన శాఖ అధికారులకు వారం రోజుల్లో అందజేయాలని AEO లను రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఆదేశించారు. టెలీ కాన్ఫరెన్స్ లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్, జిల్లా ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామలక్ష్మి, ఏఈఓలు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News