మక్తల్‌లో వికసించిన ‘బ్రహ్మకమలం’

దిశ, వెబ్‌డెస్క్: మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ పట్టణంలోని ఓ ఇంట్లో అరుదైన పువ్వు పూసింది. ఎక్కడో హిమాలయ పర్వతాల ప్రాంతంలో వికసించే అరుదైన ‘బ్రహ్మకమలం’ పుష్పాన్ని వారు జాగ్రత్తగా పెంచుకున్నారు. వివరాళ్లోకి వెళితే… మక్తల్ పట్టణంలోని జువెల్లర్స్ షాపు యజమాని క్రిష్ణయ్య గత మూడేండ్ల క్రితం కుటుంబంతో కలిసి బద్రీనాథ్ యాత్రకు వెళ్లారు. పర్యటన అనంతరం తిరుగు ప్రయాణంలో బద్రీనాథ్‌లో అత్యంత ప్రముఖమైన బ్రహ్మకమలం పుష్పాలను వెంట తెచ్చుకున్నారు. నాటినుంచి ఇంట్లో పెరట్లో ఆ మొక్కను పెట్టి […]

Update: 2021-07-09 05:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ పట్టణంలోని ఓ ఇంట్లో అరుదైన పువ్వు పూసింది. ఎక్కడో హిమాలయ పర్వతాల ప్రాంతంలో వికసించే అరుదైన ‘బ్రహ్మకమలం’ పుష్పాన్ని వారు జాగ్రత్తగా పెంచుకున్నారు. వివరాళ్లోకి వెళితే… మక్తల్ పట్టణంలోని జువెల్లర్స్ షాపు యజమాని క్రిష్ణయ్య గత మూడేండ్ల క్రితం కుటుంబంతో కలిసి బద్రీనాథ్ యాత్రకు వెళ్లారు. పర్యటన అనంతరం తిరుగు ప్రయాణంలో బద్రీనాథ్‌లో అత్యంత ప్రముఖమైన బ్రహ్మకమలం పుష్పాలను వెంట తెచ్చుకున్నారు. నాటినుంచి ఇంట్లో పెరట్లో ఆ మొక్కను పెట్టి జాగ్రత్తగా పెంచుతున్నారు. తాజాగా.. గురువారం తెల్లవారుజామున పుష్పం వికసించడంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆనందంలో మునిగిపోయారు. ఎప్పుడో మూడు నుంచి ఐదు సంవత్సరాలకు ఒకసారి వికసించే పుష్పం వికసించడంతో వారు ఆనందంలో పలువురితో విషయం పంచుకున్నారు. దీంతో ఆ పూలను చూడటానికి స్థానికులు ఆసక్తిగా ఎగబడ్డారు.

Tags:    

Similar News