38 మంది మృగాళ్లు.. 13 ఏండ్ల బాలికపై..
దిశ, వెబ్‌డెస్క్ : మాటలకందని దారుణం జరిగింది. ఒకరుకాదు.. ఇద్దరు కాదు. ఏకంగా 38 మంది కామాంధులు మైనర్‌పై పాశావికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక చెప్పిన విషయాలు విని పోలీసులే కన్నీరు పెట్టుకున్నారంటే ఆమెను ఎన్ని చిత్రహింసలు పెట్టారో అర్థమవుతోంది. నెలల తరబడి లైంగిక దాడి జరిగినా ఎవరూ గుర్తించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. కేరళకు చెందిన 13 ఏళ్ల బాలికపై కన్నెసిన కామాంధులు ఏడాదిపాటు అత్యాచారం చేశారు. ఈ ఘటనపై కేసు […]
దిశ, వెబ్‌డెస్క్ : మాటలకందని దారుణం జరిగింది. ఒకరుకాదు.. ఇద్దరు కాదు. ఏకంగా 38 మంది కామాంధులు మైనర్‌పై పాశావికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక చెప్పిన విషయాలు విని పోలీసులే కన్నీరు పెట్టుకున్నారంటే ఆమెను ఎన్ని చిత్రహింసలు పెట్టారో అర్థమవుతోంది. నెలల తరబడి లైంగిక దాడి జరిగినా ఎవరూ గుర్తించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం..
కేరళకు చెందిన 13 ఏళ్ల బాలికపై కన్నెసిన కామాంధులు ఏడాదిపాటు అత్యాచారం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు కావడంతో బాలికను అధికారులు చైల్డ్ హోమ్‌కు తరలించారు. కొన్ని రోజుల తర్వాత బాలిక తల్లి, సోదరుడు వచ్చి తీసుకెళ్లారు. ఇంటికెళ్లిన బాలిక కొద్దిరోజుల తర్వాత కనిపించకుండా పోయింది. ఆ సమయంలోనే 38 మంది కీచకులు బాలికపై రాక్షస కామ క్రీడను కొనసాగించారు. బాలిక మిస్సింగ్ పై తల్లిదండ్రులు, పోలీసులు వెతకగా.. పాలక్కడ్‌లో ఆచూకీ దొరికింది. ఆమెను నిర్భయ సెంటర్ కు తరలించి కౌన్నెలింగ్ నిర్వహించగా మృగాళ్ల తన పశువాంఛను ఎలా తీర్చుకున్నారో వివరించింది. ఆమె అనుభవించిన చిత్రహింసలను విని అధికారులు, పోలీసులు కంటతడి పెట్టారు. అయితే ఆమెపై అత్యాచారం చేసిన వారంతా పరిచయస్తులే కావడం గమనార్హం. 38 మంది మృగాళ్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై మలప్పురం సీడబ్ల్యూసీ(చైల్డ్ వెల్‌ఫేర్ కమిటీ) ప్రెసిడెంట్ షాజేశ్ భాస్కర్ స్పందించారు. బాలిక చైల్డ్ హోం ఉన్నప్పుడు భధ్రంగా ఉన్నదని, బయటకు పంపిన తర్వాత ఇలా జరగడం విచారకమన్నారు.