Today Weather Update: నేటి వాతావరణం రిపోర్ట్ ఇదే

గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో పగలు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారి వానలు దంచికొడుతున్నాయి.

Update: 2024-10-07 02:09 GMT

దిశ, వెబ్ డెస్క్ : గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో పగలు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారి వానలు దంచికొడుతున్నాయి. అయితే, ఏపీలో మరో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడొచ్చని తెలిపింది. మరి తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..

నేడు హైద్రాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 22.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు అయింది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకారం మోస్తరుగా వర్షాలు పడే అవకాశం ఉంది.. గరిష్ట ఉష్ణోగ్రత 28.23 డిగ్రీల సెల్సియస్‌గా ఉండే అవకాశం ఉంది.

వరంగల్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు అయింది. అలాగే మధ్యాహ్నం 3గంటల సమయంలో గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్‌గా ఉండే అవకాశం ఉంది.

విజయవాడలో కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు అయింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో గాలివాన పడే చాన్స్ ఉంది. అలాగే మధ్యాహ్నం 3గంటల సమయంలో గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్‌గా ఉండే అవకాశం ఉంది.

విశాఖపట్నంలో కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు అయింది. గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్‌గా ఉండే అవకాశం ఉంది.


Similar News