ఏపీలో 3 రోజులు వర్షాలే వర్షాలు..
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మండు వేసవిలో జోరు వానలు పడుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్ : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మండు వేసవిలో జోరు వానలు పడుతున్నాయి. ఉరుములు, మెరుపులు కూడిన వర్షంతో.. జనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత కొద్దిరోజులుగా ఎండలు దంచికొట్టిన నేపథ్యంలో.. వర్షాలు ప్రజలకు అలాగే కొంచెం ఇష్టంగా.. కొంచెం కష్టంగా మారాయి. అలాగే పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను అప్రమత్తం చేసింది. విచిత్రమైన వాతావరణ అంచనాలు కనిపించడంతో.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.
ఏపీలో 3 రోజులపాటు విభిన్న వాతావరణం కొనసాగుతుందని వాతవరణ శాఖ వెల్లడించింది. ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల రేపు,ఎల్లుండి పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఎల్లుండి కాకినాడలో మోస్తరు వానలు, సోమవారం అల్లూరి, కాకినాడ, తూ.గో, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. మిగతా జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.