Today Weather Update: రెండు తెలుగు రాష్ట్రాలకు వచ్చే 2 రోజుల్లో భారీ వర్షాలు!
రెండు తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి.
దిశ, వెబ్ డెస్క్ : గత నాలుగు రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. అయితే, ఈ రోజు ఏపీ, తెలంగాణలో వచ్చే రెండు రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ ఈదురుగాలులు, ఊరుములు మెరుపులతో కూడిన వానలు పడొచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ సూచనలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం..
హైద్రాబాద్ లో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 32 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఉదయం 11 తర్వాత వానలు పడే అవకాశం ఉంది.
వరంగల్ లో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 33 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఉదయం 11 తర్వాత కొన్ని ప్రాంతాల్లో వానలు పడే అవకాశం ఉంది.
విజయవాడలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 33 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఉదయం 10 తర్వాత ఉరుములతో కూడిన వానలు పడే అవకాశం ఉంది.
విశాఖపట్నంలో ఉష్ణోగ్రత గమనిస్తే.. మాగ్జిమం 32 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఉదయం 9 తర్వాత భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.