ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై విపక్షాల రియాక్షన్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై విపక్ష పార్టీలు స్పందించాయి. ఈ మేరకు బడ్జెట్‌పై కాంగ్రెస్ ఎంపీలు, శశిథరూర్, కార్తి చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మధ్యంతర బడ్జెట్‌పై విపక్ష పార్టీలు స్పందించాయి. ఈ మేరకు బడ్జెట్‌పై కాంగ్రెస్ ఎంపీలు, శశిథరూర్, కార్తి చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలో వీదేశీ పెట్టుబడులు తగ్గినా.. పెరిగాయని బడ్జెట్‌లో ప్రసంగించారని అసహనం వ్యక్తం చేశారు. స్వీయ పొగడ్తలకే బడ్జెట్ పరిమితం అయిందని కార్తి చిదంబరం విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ఇది వీడ్కోలు బడ్జెట్ అని ఎద్దేవా చేశారు. మరోవైపు.. బడ్జెట్‌పై ప్రధాని మోడీ కూడా స్పందించారు. ఈ మధ్యంతర బడ్జెట్ సమగ్రమైనదని, వినూత్నమైనదని వ్యాఖ్యానించారు. అభివృద్ధి కొనసాగుతుందనే విశ్వాసాన్ని కల్పిస్తోందని అన్నారు. విక్‌సిత్ భారతానికి 4 స్తంభాలైన యువత, పేదలు, మహిళలు, రైతులను ఈ మధ్యంతర బడ్జెట్ శక్తివంతం చేస్తుందని హర్షం వ్యక్తం చేశారు.