పన్ను చెల్లింపుదారులకు కేంద్రం గుడ్ న్యూస్
ఎన్నో ఆశలతో బడ్జెట్ ప్రసంగాన్ని వీక్షిస్తున్న పన్ను చెల్లింపుదారులకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. గురువారం బడ్జెట్ ప్రసంగంలో భాగంగా ఆమె పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. కొత్త ట్యాక్స్ విధానం ప్రవేశ పెట్టారు.
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నో ఆశలతో బడ్జెట్ ప్రసంగాన్ని వీక్షిస్తున్న పన్ను చెల్లింపుదారులకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ శుభవార్త చెప్పారు. గురువారం బడ్జెట్ ప్రసంగంలో భాగంగా ఆమె పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. కొత్త ట్యాక్స్ విధానం ప్రవేశ పెట్టారు. ఈ నూతన విధానంతో ఏడాదికి రూ.7 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు కల్పిస్తున్నట్లు తెలిపారు. అనుకూల ప్రకటనలు వస్తాయని ఆశించిన పన్ను చెల్లింపుదారులకు ఈ వార్త కాస్త ఉపశమనం ఇచ్చినట్లు తెలుస్తోంది.
కాగా, గత మధ్యంతర బడ్జెట్‌లోనూ 2019లో నాటి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కీలక ప్రకటనలు చేశారు. రూ.5 లక్షల వరకు వార్షిక ఆదాయం కలిగిన వారు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని మధ్యంతర బడ్జెట్‌లో ప్రకటించారు. అలాగే రూ. 6.50 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తులు ప్రావిడెంట్ ఫండ్స్, స్పెసిఫైడ్ సేవింగ్స్, ఇన్సూరెన్స్ మొదలైన వాటిలో పెట్టుబడులు పెడితే ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని ఉన్నాయని ఆయన చెప్పారు. తాజాగా.. ఈ సారి నిర్మలమ్మ బడ్జెట్‌లో ఏకంగా రూ.7 లక్షలకు పెంచుతూ కీలక ప్రకటన చేశారు.