2024-2025 బడ్జెట్: పేదరికం నుంచి బయటపడ్డ 25 కోట్ల మంది
2024-2025 బడ్జెట్‌ను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టారు.
దిశ, వెబ్ డెస్క్: 2024-2025 బడ్జెట్‌ను కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. "గరీబ్ కళ్యాణ్, దేశ్ కా కళ్యాణ్" అనే నినాదాన్ని ఇచ్చారు. పేదలకు సాధికారత కల్పించడానికి చూస్తున్నాము. గత పద్దతుల ద్వారా దేశంలో పేదరికాన్ని పరిష్కరించడంలో మంచి ఫలితాలు వచ్చాయి. పేదలు సాధికార భాగస్వాములు అయినప్పుడు అభివృద్ధి ప్రక్రియలో వారికి సహాయం చేయడానికి ప్రభుత్వ అనేక రెట్లు ప్రయత్నించింది. 'సబ్కా కా సాత్' సాధనతో ఈ పదేళ్లలో ప్రభుత్వం 25 కోట్ల మంది పేదలను పేదరికం నుంచి బయట పడటానికి కృషి చేసింది.