బ్యాటింగ్ ముగించిన ముంబై.. చెన్నై టార్గెట్ ఫిక్స్!
చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఐపీఎల్ 2025 మూడవ మ్యాచ్ జరుగుతోంది.

దిశ, వెబ్ డెస్క్: చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ఐపీఎల్ 2025 (IPL 2025) మూడవ మ్యాచ్ జరుగుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings), ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తలపడుతున్న ఈ మ్యాచ్ లో చెన్నై టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ను ఎంచుకుంది. దీంతో క్రీజులోకి వచ్చిన ముంబై ఆటగాళ్లు 20 ఓవర్లలో కేవలం 155 పరుగులు చేసి, ఆలౌట్ గా నిలిచారు. వీరిలో కెప్టెన్ రోహిత్ శర్మ (Rojith Sharma) మొదటి ఓవర్ లోనే డకౌట్ అయ్యాడు. తరువాత వరసగా ర్యాన్ రికెల్టన్, విల్ జాక్స్ పవర్ ప్లే లోనే పెవీలియన్ కు చేరుకున్నారు.
తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్య కుమార్ యాదవ్, తిలక్ వర్మ్ భాగస్వామ్యంతో 51 పరుగులు చేసి ఇన్నింగ్స్ నిలబెట్టారు. అనంతరం చెన్నై ఆటగాడు నూర్ (Noor) మ్యాజిక్ చేసి వరుసగా వికెట్లు తీసుకున్నాడు. నూర్ తన అత్యుత్తమ ప్రదర్శనతో 4 వికెట్లు తీసి, కేవలం 18 పరుగులు మాత్రమే సమర్పించుకున్నాడు. ప్రస్తుతం 156 పరుగుల టార్గెట్ తో చెన్నై సూపర్ కింగ్స్ బరిలోకి దిగింది. చైన్నై నుంచి రచీన్ రవీంద్ర, రాహుల్ త్రిపాఠి ఓపెనర్లుగా రాగా.. ముంబై బౌలర్ చహార్ చేతిలో రాహుల్ అవుట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి రుతురాజ్ గైక్వాడ్ వచ్చాడు. ప్రస్తుతం చెన్నై స్కోర్ 3 ఓవర్లకు గాను ఒక వికెట్ కోల్పోయి 24 పరుగులు సాధించారు.