SRH జట్టు భారీ స్కోర్ చేయలేకపోవడానికి కారణం ఇదే: టామ్ మూడీ
ఐపీఎల్ 2023 లో ఎన్నో అంచనాల నడుమ భరిలోకి దిగిన SRH జట్టు.. పేలవమైన ఆట తీరుతో అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొంటుంది.
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023 లో ఎన్నో అంచనాల నడుమ భరిలోకి దిగిన SRH జట్టు.. పేలవమైన ఆట తీరుతో అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొంటుంది. అయితే దీనిపై మాట్లాడిన SRH మాజీ ప్రధాన కోచ్ టామ్ మూడీ.. ఈ సీజన్‌లో హైదరాబాద్ ఆడిన రెండు మ్యాచుల్లో భారీ స్కోరు చేయలేక పోయింది. ఎందుకంటే.. ఈ జట్టులో ఎక్కువగా కుడిచేతి వాటం బ్యాటర్లు ఉన్నారు. ఇదే వారికి ప్రధాన కారణం అని చెప్పుకొచ్చారు. ఈ సమస్యను SRH అధిగమించాలి అంటే.. తమ బ్యాటింగ్ లైనప్ లో మార్పులు చేస్తే అది సాధ్యం అని చెప్పుకొచ్చాడు.